Home News ఒక విద్యార్థి తల్లిదండ్రుల కోసం ఆత్మహత్య చేసుకున్నాడు

ఒక విద్యార్థి తల్లిదండ్రుల కోసం ఆత్మహత్య చేసుకున్నాడు

197
0

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు కలిసుండాలని లేఖ రాసి బీబీఏ చదివే ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంజీవ్ రెడ్డి, హేమలత దంపతులకు ఆకాష్ రెడ్డి (20) అనే కొడుకు ఉంటున్నాడు. ఆకాష్ రెడ్డి ప్రస్తుతం బ్యాచ్‌లర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) చదువుతున్నాడు. అయితే కుటుంబ కలహాల కారణంగా తల్లిదండ్రులు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ తరుణంలో ఆకాష్ రెడ్డి దీనిపై తీవ్ర మనోవేధనకు గురయ్యాడు. ఈ తరుణంలో అమ్మ, నాన్నలు కలిసుండాలని సూసైడ్ నోట్ రాసి ఆకాష్ రెడ్డి (20) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తన కుమారుడి మరణానికి భర్త సంజీవ్ రెడ్డితో పాటు బంధువులపై అనుమానం వ్యక్తం చేస్తూ తల్లి హేమలత నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here