శ్రుతి హాసన్ ఎందుకు తప్పుకున్నారు?

0
115

కాటమరాయుడు, గబ్బర్ సింగ్ సినిమాల్లో జోడి కట్టిన శృతి హాసన్ – పవన్ కళ్యాణ్ జంట మరోమారు వకీల్ సాబ్ లో నటించబోతున్నట్లుగా వార్తలు రావడం, శృతి హాసన్ కూడా చెప్పి చెప్పకనే వకీల్ సాబ్ లో నటిస్తున్నట్లుగా కన్ఫర్మ్ చెయ్యడం జరిగింది. ఇక శృతి హాసన్ అందుకోసమే లాక్ డౌన్ ముగిసి ఫ్లైట్స్ తిరగగానే.. హైదరాబాద్ కి వచ్చేసినట్లుగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం హైదెరాబాడ్ లోనే ఉన్న శృతి హాసన్ వకీల్ సాబ్ షూటింగ్ కోసం వెయిటింగ్ అన్నారు. శృతి హాసన్ మల్లి వకీల్ సాబ్ టీం కి హ్యాండ్ ఇచ్చింది. వకీల్ సాబ్ కోసం కాదు హైదరాబాద్ వచ్చింది.. రవితేజ క్రాక్ బ్యాలెన్స్ షూటింగ్ కోసం అన్నారు.

అయితే తాజాగా శృతి హాసన్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కి హ్యాండ్ ఇస్తే .. కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు సినిమాలో పవన్ కళ్యాణ్ తో నటించిన తమన్నా పవన్ వకీల్ సాబ్ లో పవన్ భార్య పాత్రకి రాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. శృతి హాసన్ అర్ధాంతరంగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో తమన్నా ని సంప్రదించారని.. జస్ట్ గెస్ట్ రోల్ కాబట్టి డేట్స్ ప్రాబ్లెమ్ కూడా ఉండదని తమన్నా వెంటనే ఒప్పేసుకుందని అంటున్నారు.  ఈ కలయిక హిట్ అవుతుందో లేదో వేచి చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here