వర్మ గారు ఏం చేసినా సంచలనమే… తెలియక చేస్తారో వార్తల్లో నిలవాలని చేస్తారో తెలియదు కానీ ఏదో ఒకటి చేసి కాంట్రవర్శీతో తనవైపుకు అందరిని తిప్పుకుంటాడు. ఇక ఇటీవల అప్సర రాణి అనే అమ్మాయిని వర్మ వెలుగులోకి తీసుకొచ్చాడు. ఒడిశా కు చెందిన ఈ అమ్మడు గతంలో రెండు సినిమాలు చేసినప్పటికీ ఎవ్వరూ గుర్తించలేదు. కానీ వర్మ చేతిలో పడ్డాక ఆమెకు ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఎంతలా అంటే కుర్రకారు మొత్తం గూగుల్ లో అప్సర రాణి పేరునే కలవరిస్తున్నారు.
ఈ అమ్మడితో త్రిల్లర్ అనే మూవీని తెరకెక్కిస్తున్న అని వర్మ ముందే చెప్పేశాడు. అయితే ప్రమోషన్స్ అప్పుడే మొదలెట్టేసాడు. ఆ ప్రమోషన్స్ కూడా మాములుగా లేవు… ముద్దులు హగ్గులు తో నలిపేస్తున్నాడు. అప్సర తో వర్మ దిగిన ఆ ఫోటోలకు నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.