‘రాధే శ్యామ్’గా వస్తోన్న రెబల్ స్టార్- ప్రభాస్ ఫస్ట్ లుక్ సూపర్

0
46

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే చేస్తోంది. దాదాపు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఫష్ట్ లుక్‌తో పాటు టైటిల్‌తో కూడిన పోస్టర్‌ను రిలీజ్ చేసారు. ఈ రోజు బాహుబలి .. ఫస్ట్ పార్ట్ రిలీజై ఐదేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్బంగా మూవీ మేకర్స్.. ఈ సినిమాకు ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ ఖరారు చేయడంతో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసారు. ఇప్పటికే బాహుబలి సినిమా విడుదలైన ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా యూవీ క్రియేషన్స్ వాళ్లు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో ప్రభాస, పూజా హెగ్డేల పోస్టర్‌ చాలా రొమాంటిక్‌గా ఉంది.

కొత్త అప్ డేట్‌తో వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈనెల 10న పది గంటలకు విడుదల చేయనున్నామని తెలిపింది చిత్రబృందం. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను జిల్ ఫేమ్ రాధా కృష్ణ తెరకెక్కిస్తుండగా.. పిరియాడిక్ జానర్‌లో ఉండనుందని సమాచారం. ఈ సినిమా టైటిల్ విషయంలో కాస్తా అయోమయంలో ఉన్నారు అభిమానులు. మొన్నటి వరకు జాన్ అంటూ ప్రచారం అవ్వగా.. ఇప్పుడు రాధే శ్యామ్ అంటున్నారు. దీనిపై క్లారిటీ ఈ నెల పదోతారిఖున రానుంది. ఇక ఈ సినిమాలో వరుస విజయాలతో దూసుకుపోతున్న పూజ హెగ్డే పాత్ర ఏమై ఉంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో వుంది. వస్తోన్న సమాచారం మేరకు ఆమె మ్యూజిక్ టీచర్ గా కనిపించనుందట. ఈ సినిమా కథ చాలా కాలం క్రితం జరుగుతుంది గనుక, అప్పటికి సంబంధించిన ఓల్డ్ లుక్ తోనే పూజ కనిపించనుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఈ అంతేకాదు ఈ సినిమాలో పూజా చాలా కొత్తగా కనబడుతూ.. ఇంతవరకూ పూజ చేసిన పాత్రలకి ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషాల్లో విడుదలకానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here