శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో జశోధ అనే ప్రయాణికురాలు మృతి చెందింది. గురువారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి తిరుపతి వేళ్ళేందుకు వచ్చిన జశోధ విమానం ఎక్కుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఇది గమనించిన ఎయిర్ పోర్ట్ ఆధికారులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను ఎయిర్ పోర్ట్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించగా చికిత్స పోందుతూ జశోధ మృతి చెందింది. జశోధ కోల్కత్త వాసిగా అధికారులు గుర్తించారు. మృతురాలు క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.