ప్రముఖ సినీ నటి రేఖ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన మద్దెల సబీరా(రేఖ) (42) కొంత కాలం క్రితమే హైదరాబాద్ వచ్చి పలు టీవీ సీరియళ్లలో నటించారు. ఇవాళ బాత్ రూంలో ఆత్మహత్యకు పాల్పడింది. అవకాశాలు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రేఖ మొదట అహ్మద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.
వారిమధ్య మనస్పర్థలతో విడిపోయి రియల్ ఎస్టేట్ చేస్తున్న చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. చైతన్య రియల్ ఎస్టేట్ లో తీవ్ర నష్టాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె బాత్ రూంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.