సుమంత్ అశ్విన్ చిత్రంపై అనసూయ స్పష్టత

0
73

జబర్దస్త్ షో ద్వారా అందరికి పాపులర్ అయింది యాంకర్ అనసూయ.. షోలో యాంకరింగ్ చేస్తూనే మంచి పాత్రల వచ్చినప్పుడు వెండితెర పైన కూడా మెరుస్తుంది అనసూయ.. సోగ్గాడే చిన్నినాయనా, క్షణం, కథనం, రంగస్థలం సినిమాలలో నటించింది అనసూయ.. అయితే ఇందులో రంగస్థలం సినిమాలో ఆమె పోషించిన రంగమ్మత్త పాత్ర ఆమెకి మంచి పేరును తీసుకువచ్చింది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా అనసూయ ఓ సినిమాలో హీరోకి తల్లి పాత్ర చేసేందుకు ఓకే చెప్పిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


హీరో సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో అతనికి తల్లిగా అనసూయ నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే దీనికంటే ముందు ఆ పాత్రను నటి ఇంద్రజను అనుకున్నారని, కానీ ఆమె కరొనా నేపధ్యంలో షూటింగ్ లకు రావడానికి నిరాకరించడంతో ఆమె స్థానంలో మేకర్స్ యాంకర్ అనసూయను తీసుకున్నారని ఫిలిం నగర్ లో వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ వార్తల పైన అనసూయ స్పందించింది. ఆ సినిమాలో తానూ నటిస్తున్నానని వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని, అది కేవలం ఫేక్ న్యూస్ అంటూ క్లారిటీ ఇచ్చింది అనసూయ..

అనసూయ ఈ వార్తల పైన క్లారిటీ ఇవ్వడంతో మొత్తానికి ఈ వార్తలకి చెక్ పెట్టినట్టు అయింది. ప్రస్తుతం అనసూయ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగామార్తండ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ప్రకాష్ రాజ్ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ నటిస్తుంది. హాస్యనటుడు బ్రహ్మనందం ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. నిన్న (సోమవారం) విశాఖపట్నంలో షూటింగ్ ప్రారంభం అయింది. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మరాఠీ భాషలో మంచి హిట్టైనా నటసామ్రాట్ కి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here