గులాబీ అంబులెన్సులు…మరియు కరోనా పరీక్ష కూడా

0
101

యువ‌నేత ఓ ప్ర‌క‌ట‌న చేశాడు. అంతే అప్ప‌టి వ‌ర‌కు మాకేందుకు లే అనుకున్నారో… ఖ‌ర్చు అవ‌స‌ర‌మా అనుకున్నారో… కానీ యువ‌నేత మెప్పు కోసం మేమేంటే మేము అంటూ గులాబీ అంబులెన్సుల ప్ర‌క‌ట‌న ఇచ్చేశారు.

భ‌విష్య‌త్ ముఖ్య‌మంత్రిగా టీఆర్ఎస్ పార్టీలో జోరుగా ప్ర‌చారం ఉన్న మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా సినీ, రాజ‌కీయ‌, వ్యాపార ప్ర‌ముఖులు పోటీప‌డి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. మంత్రులంతా త‌మ ఎమ్మెల్యేల‌తో వ‌చ్చి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెప్తున్న త‌రుణంలో… రాష్ట్రంలో కోవిడ్ ప‌రిస్థితుల దృష్ట్యా టెస్టింగ్ త‌క్కువ‌గా ఉంటుంద‌న్న ప్ర‌తిపక్షాల విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో కరోనా ప‌రీక్ష‌లు చేయ‌గ‌ల అంబులెన్సుల‌ను త‌న‌వంతుగా ఆరు అందిస్తున్న‌ట్లు మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. కేటీఆర్ అలా ప్ర‌క‌ట‌న చేశాడో లేదో మంత్రులంతా పోటీ ప‌డి మ‌రీ అంబులెన్సులను ప్ర‌భుత్వానికి ఉచితంగా ఇస్తామంటూ ముందుకొచ్చారు.

కేటీఆర్ మంత్రి ఈటెల‌కు ఈ విష‌యం చెప్ప‌గానే… త‌న త‌రుపున ఈటెల 5 అంబులెన్సుల‌ను, మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి 6, మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ 11, మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు 6, మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి 4, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్ మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌తో క‌లిసి 3, ఎంపీ రంజిత్ రెడ్డి 7, ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు 6, మంత్రి గంగుల క‌మ‌లాకర్ 6, మంత్రి నిరంజ‌న్ రెడ్డి 3, మంత్రి మ‌ల్లారెడ్డి 6, మంత్రి స‌బిత 2… ఇలా పార్టీ త‌రుపున 32జిల్లాల్లో 100అంబులెన్సుల‌ను ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 15 రోజుల్లో వీటిని ప్ర‌భుత్వానికి అందిస్తామ‌ని, క‌రోనా టెస్టులు చేసే సామ‌ర్థ్యంతో పాటు వెంటిలేట‌ర్ స‌దుపాయం ఉన్న వాటిని ఇస్తామ‌ని తెలిపారు.

ప్ర‌భుత్వం అంబులెన్సుల కోసం ఎలాంటి కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టించ‌కున్నా… పార్టీ ప‌రంగా అయినా స‌రే నిజంగానే 100 అంబులెన్సులు అందుబాటులోకి వ‌చ్చి, ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడితే చాలులే, ఎంతైనా గుడి క‌న్నా మెల్ల న‌యం క‌దా అంటూ ప‌లువురు నిట్టూర్చుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here