ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరు పొందిన నిజా ఏడో రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ సంతానం కనుమరుగైంది. ఇప్పటి వరకు బతికి ఉన్న ఆయన కూతురు తుది శ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో బషీరున్నిసా బేగం (93) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. బసీరున్నీసా మరణంపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
బషీరున్నిసా బేగం 1927లో జన్మించారు. నావాబ్ కాసిం యార్ జంగ్‌తో వివాహం జరిగింది. ఆమె కుటుంబం పురాణీ హవేలిలో నివసిస్తోంది. ఆమెకు కూతురు రషీదున్నిసా బేగం ఉన్నారు. బసీరున్నీసా బేగం అంత్యక్రియలు పాతబస్తీలోని దర్గా యాహియా పాషా స్మశానవాటికలో చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పలువురు ప్రముఖులు ఆమె నివాసానికి వెళ్లి నివాళ్లు అర్పించారు. ఆమె మరణంతో ఇక నిజాం రాజు సంతానంలో ఎవరూ మిగలకుండా పోయారు. రెండేళ్ల క్రితం ఆమె ఏడో నిజాం కొడుకు నవాబ్ ఫజల్ జా బహదుర్ చనిపోవడంతో ఆయన సంతానం మొత్తం చనిపోయినట్టైంది.కాగా నవాబ్ ఫజల్ జా జహదూర్కు 34 మంది సంతానం ఉన్నారు.