Home gossips సోను సూద్ తన రాజకీయ ప్రవేశంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ..

సోను సూద్ తన రాజకీయ ప్రవేశంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ..

189
0

లాక్ డౌన్ తో అష్టకష్టాలు పడ్డ వలసకార్మికులను ఆదుకోవడంతో మొదలు పెట్టి .. కష్టాల్లో ఉన్నారని తెలిసిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ దేశవ్యాప్తంగా ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు సోనూసూద్..ఈ రోజు దేశంలో అనేక లక్షలమంది సోనూని తమ ఫ్యామిలి మెంబర్ గా ఫీలవుతున్నారు..తను రాజకీయాల్లోకి వస్తే ఇంకా ఎక్కువమందికి సాయం చేయవచ్చు అని చాలామంది అభిప్రాయపడుతున్నాడు..తన పొలిటికల్ ఎంట్రీ గురించి సోనూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు..

ఒక్కడే ఇంతమందికి సాయం చేస్తుంటే ఎందరో దేవుడంటూ పొగుడుతుంటే..ఇదంతా స్వలాభం కోసం సోనూ వెనక ఉండి ఎవరు నడిపిస్తున్నారు..పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వడానికే ఇదంతా చేస్తున్నాడని బురద చల్లినవాళ్లు ఉన్నారు.. కానీ , ఇతరులకు సాయం చేసే గుణం తన తల్లిదండ్రుల నుండి అలవడిందని, ఫ్యూచర్ లో కూడా ఈ సేవాకార్యక్రమాలు కొనసాగుతాయని అన్నాడు..ప్రతి ఒక్కరూ మానవత్వంతో ఎదుటివారికి సాయం చేయాలని తన పుట్టినరోజు సంధర్భంగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు..

“నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, యాక్టర్ గా ఉంటూ కూడా నేను ఈ కార్యక్రమాలు చేయొచ్చు..నా యాక్టింగ్ కెరీర్ ఎన్నాళ్లుంటుందో..ఐదేళ్లు,పదేళ్లు కావొచ్చు..అంతకాలం నా నటనను కొనసాగిస్తాను..నటిస్తూనే అందరికి సాయం చేస్తాను..ఎదుటి మనిషికి సాయం చేయాలంటే పాలిటిక్స్ లోకి రావల్సిన అవసరం లేదన్నది నా అభిప్రాయం అంటూ పాలిటిక్స్ చేస్తున్నాడంటూ కామెంట్ చేసిన వారందరి నోరూ మూయించాడు.. సోనూ రాజకీయాల్లోకి వస్తే బాగుండు అనుకున్న సాధారణ ప్రజల ఆశ నిరాశ అయినప్పటికి..తనెక్కడున్నా ఎలా ఉన్నా నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని లక్షలాది మంది తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here