హైదరాబాద్-తెలంగాణ రాష్ట్ర గౌడ జేఏసీ ఏర్పాటైంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని అన్ని గౌడ సంఘాలను ఏకం చేస్తూ జేఏసీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ చైర్మెన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణగౌడ్ తెలంగాణ గౌడ జేఏసీ కన్వీనర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, తెలంగాణ జేఏసీ చైర్మెన్‌గా పల్లె లక్ష్మణ్‌గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో గౌడ సంఘాలన్ని ఒకే తాటిపైకి తీసుకురావడానికి జేఏసీ ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. చెట్టు పన్ను రద్దు, నీరా పాలసీ, 5 లక్షల ఎక్స్‌గ్రేసియా, ప్రభుత్వ భూముల్లో ఈత చెట్ల పెంపకం.. వంటి ఎన్నో కీలక నిర్ణయాలను అమలు చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం గౌడ సామాజిక వర్గానికి ఎంతో చేయుతనిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రాజయ్యగౌడ్, అశోక్ గౌడ్, ప్రసాద్ గౌడ్, ముద్దం స్వామి గౌడ్ వివిధ జిల్లాల నుంచి గౌడ సంఘ ముఖ్య నాయకులు 500కుపైగా మంది పాల్గొన్నారు.