వివాహం జరిగింది …. ఒక కొడుకు ఉన్నాడు … కాని ఇంటర్‌లో టాపర్ వచ్చింది

0
101

అగర్తల:త్రిపుర రాష్ట్రంలోని గాంధీగ్రామ్ టౌన్ లో నివసించే సంఘమిత్ర దేబ్ కు 15 ఏండ్లకే పెండ్లయింది. పెండ్లయిన ఏడాదికి టెన్త్ కంప్లీట్ చేసి, 77 శాతం మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా ఆమె చదువు కొనసాగించింది. అప్పటికే ఓ కొడుకు పుట్టినా కాలేజీలో చేరింది. కష్టపడి చదివిన సంఘమిత్ర.. త్రిపుర ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో 92.6 శాతం మార్కులతో టాప్ టెన్ లో నిలిచింది. ‘‘ఇంటి పనులు, నా కొడుకు బాగోగులు చూసుకున్న తర్వాత చదువుకునేదాన్ని. ఈ రిజల్స్ట్ తో నేను సంతోషంగా ఉన్నాను. ఇదే విధంగా డిగ్రీ కూడా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను” అని సంఘమిత్ర చెప్పారు. సంఘమిత్రకు ఇప్పుడు 19 సంవత్సరాలు, ఆమె కుమారుడికి రెండున్నర సంవత్సరాలు. ఆమె భర్త రాజు ఘోష్ బీఎస్ఎఫ్ జవాన్. పెళ్లి అయిన పట్టుదలతో, మంచి మార్కులు సాధించిన సంఘమిత్ర ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here