సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ టిక్‌టాక్ కొనుగోలు కోసం జరుగుతున్న ప్రచారంపై వెలుగు నింపింది. టిక్‌టాక్ కొనుగోలు చేసేందుకు సిద్ధంగానే ఉన్నామని.. కానీ అమెరికా అధ్యక్షడు ట్రంప్‌తో చర్చించిన తర్వాతే దానిపై నిర్ణయం తీసుకంటామని ప్రకటించింది. టిక్‌టాక్ సంస్థతో చర్చలు కొనసాగించిడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. దానికి ముందు ట్రంప్‌తో ఈ అంశంపై చర్చించాలని భావిస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ సీఈవోసత్య నాదెళ్ల ప్రకటించారు.
దేశ భద్రత దృష్ట్యా టిక్‌టాక్‌పై నిషేధం విధిస్తూ భారత్ నిర్ణయం తీసుకున్నాక.. ఇతర దేశాలు కూడా అదే ఆలోచనలో పడ్డాయి. కొద్ది రోజులగా అమెరికా ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు కూడా చేస్తోంది. టిక్‌టాక్‌ను చైనానే పెంచి పోషిస్తోందని… దాని కారణంగా తమ పౌరుల సమాచారాన్ని చైనా ఇంటెలిజెన్స్ వినియోగించుకునే అవకాశం ఉందని అమెరికా వాదిస్తోంది.