వైరల్ అవుతున్న నిహారికా వీడియో… ఏ పని అయినా రెండే నిముషాలు…

0
69

మెగా డాటర్ నిహారిక కొణిదెల గత కొన్ని రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. కాబోయే భర్త చైతన్యతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ సందడి చేస్తోంది. భర్త పుట్టిన రోజు సందర్భంగా జాలీగా తిరుగుతూ ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు నిహారిక షేర్ చేసిన ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిహారిక తాజాగా ఓ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌ను నిహారిక పెట్టిన కామెంట్, ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. అదేంటో ఓ సారి చూద్దాం.

నిహారికి తెరపై ఎంత చలాకీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. బుల్లితెరపై ఎంత యాక్టివ్‌గా ఉంటూ పంచ్‌లు, సెటైర్లు వేస్తుందో సోషల్ మీడియాలోనూ అంతే సరదాగా ఉంటుంది. అభిమానులతో ముచ్చిటిస్టూ వారడిగే ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఫోటోలను షేర్ చేస్తూ, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఎప్పుడూ యాక్టివ్ మోడ్‌లో ఉంటుంది.

పెళ్లిపై క్లారిటీ.. మీడియా, వెబ్ సైట్లు, యూ ట్యూబ్ చానెల్లకు నిహారిక బోల్డెంత స్టఫ్ అయ్యేది. నిహారిక పెళ్లి విషయంపై కొన్ని వందల వార్తలు, రూమర్లు పుట్టుకొచ్చాయి. ఇదిగో పెళ్లి అదిగో పెళ్లి అంటూ హీరోలతోనూ లింకులు పెట్టి రాశారు. చివరకు ప్రభాస్-నిహారిక పెళ్లి అంటూ రచ్చ రచ్చ జరిగింది. చివరకు నిహారిక పెళ్లిపై అందరికీ ఓ క్లారిటీ వచ్చింది.

భర్తతో రొమాంటిక్.. నిహారికకు ఈ లాక్ డౌన్‌లో భర్త దొరికాడు. గుంటూరు ఐజీ కుమారుడు చైతన్యతో నిహారికకు పెళ్లి ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని నిహారిక సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిపింది. కాబోయే భర్తను కౌగిలిలో బంధించి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ పెళ్లి ఫిక్స్ అయినట్టు పేర్కొంది.

బర్త్ డే స్పెషల్ విషెస్..

‘ఈ ఒక్క చిరునవ్వు రూమ్ నిండా వెలుగులు నింపుతుంది. ఆ ఒక్క హగ్ సొంత నివాసంలా అనిపిస్తుంది. నువ్వే నా సంతోషానికి చిరునామా. ప్రపంచలోనే అత్యుత్తమమైనవన్నీ పొందగలిగే అర్హత ఉన్నవాడివి. హ్యాపీ బర్త్ డే లవ్’ అంటూ తాళి మెడలో పడక ముందే భర్తపై ప్రేమను కురిపిస్తూ బర్త్ డేకు స్పెషల్‌గా విషెస్ తెలిపింది.

ఏదైనా సరే రెండు నిమిషాలే..

తాజాగా నిహారిక ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తన వాచీని రిపేర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దాన్ని బాగుచేయడానికి ప్రయత్నించి విఫలమైనట్టు కనిపిస్తోంది. తనకు ఏ పని అయినా సరే రెండు నిమిషాల వరకు ప్రయత్నించే ఓపిక ఉంటుందని, ఆపై తన వల్ల కాదని చెబుతూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here