బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన మరణానికి ముందు అనుభవించిన భావోద్వేగమైన అంశాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. బాలీవుడ్లో కొందరు తనను వేధించిన తీరుపై ఆవేదన చెందిన క్షణాలను తన సోదరికి చెప్పుకొని ఎలా బాధపడ్డారనే విషయాలను ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ స్మితా పారిఖ్ శుక్రవారం రాత్రి రిపబ్లిక్ టీవీ జరిపిన చర్చ సందర్భంగా దిగ్బ్రాంతిని కలిగించే విషయాలు వెల్లడించారు. స్మిత చర్చ సందర్బంగా మాట్లాడుతూ…
ఒకరకమైన ఆందోళనతో బాధపడుతూ సుశాంత్‌లో ఎన్నడూ ఎలాంటి డిప్రెషన్ కనిపించలేదు. కానీ ఏదో రకమైన ఆందోళనకు లోనయ్యేవాడు. తన మాజీ మేనేజర్ దిశ మరణానికి ముందు చాలా నార్మల్‌గా ఉండేవారు. టేబుల్ టెన్నిస్ ఆడటం, నిత్యం మెడిటేషన్ చేస్తుండేవారు. నాలుగు సెషన్లపాటు అడ్వాన్డ్స్ యోగా తన సోదరితో కలిసి పూర్తి చేశాడు అని స్మిత వెల్లడించారు.
దిశ మరణంతో ఒక్కసారిగా కుంగిపోయి దిశా సలియాన్ మరణంతో ఒక్కసారిగా సుశాంత్ సింగ్ కుంగిపోయారు. ఆయనపై ఆమె ప్రభావం తీవ్రంగా పడింది. దిశ మరణంతో ఓ రకమైన భయానికి గురయ్యారు. ఆయన రకమైన ఆందోళనకు గురయ్యాడు కానీ డిప్రెషన్‌కు లోనవ్వలేదు అని స్మిత పారిఖ్ వెల్లడించారు. తన మరణానికి ముందు వారానికి ఒక్కసారైన కలిస గంటల తరబడి మాట్లాడుకొనే వాళ్లమని చెప్పారు.
నన్నూ వదిలిపెట్టరు అని తన సోదరితో జూన్ 9వ తేదీన దిశా సలియాన్ మరణించారు. దాంతో సుశాంత్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తన సోదరి మితూతో తన భయాన్ని వ్యక్తం చేశారు. దిశ సలియానే కాదు.. నన్ను కూడా వదలరు. నన్ను కూడా బాలీవుడ్లో లేకుండా ఖతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని స్మిత లైవ్‌లో సంచలన విషయాలు వెల్లడించారు. అయితే తాను ఎవరిని చూసి భయపడుతున్నారనే విషయం తనకు తెలియదని చెప్పారు.
బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పి.. వ్యవసాయం వైపు నవంబర్‌లో తనను కలిసినప్పుడు చాలా సమస్యల్లో ఉన్నట్టు కనిపించాడు. బాలీవుడ్ గుడ్ బై చెప్పి… వ్యవసాయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపించారు. తన మరణానికి మూడు రోజుల ముందు కూడా అదే విషయాన్ని నాకు చెప్పారు. కానీ ఊహించని రీతిలో జూన్ 14వ తేదీన మరణించడం షాక్ గురిచేసింది అని స్మిత చెప్పారు.
సోదరి భర్తతో కూడా సుశాంత్ తీవ్ర ఒత్తిడిలో ఉన్న సుశాంత్ తన సోదరి ప్రియాంక భర్త, ఐపీఎస్ ఆఫీసర్‌ను పిలిపించుకొన్నారు. తాను బాలీవుడ్‌ను వదిలేయాలని అనుకొంటున్నట్టు తన బావతో చెప్పారు. నవంబర్‌లో ఓసారి బాలీవుడ్‌ను వదిలేసి మరో చోట బతకాలని అనుకొన్నాడు. ఆ క్రమంలో తన సోదరితో కలిసి చంఢీగడ్‌కు వెళ్లి కొన్ని రోజలు ఉండి వచ్చారు. సుశాంత్ నిరాశతో బాధపడలేదు. తనకు బైపోలార్ డిజార్డర్ లేదని స్మితా పరిఖ్ స్పష్టం చేశారు.