చంటిపై రాకేష్ మాస్టర్ కామెంట్స్.. జఫ్పా అంటూ స్కిట్ చేయడంపై రియాక్షన్

0
252

రాకేష్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. అదే విధంగా జబర్దస్త్‌లో వేసే సెటైర్లు, ఇమిటేషన్‌ల గురించీ చెప్పనక్కర్లేదు. రాకేష్ మాస్టర్‌ను జబర్దస్త్ టీం లీడర్స్ బాగానే వాడుకుంటున్నారు. ఆ మధ్య హైపర్ ఆది, రీసెంట్‌గా చంటి ఫుల్ వాడేసుకున్నారు. రాకేష్ మాస్టర్ మ్యానరిజం, గెటప్‌లతో సెటైర్స్ వేశారు. వీటిపై రాకేష్ మాస్టర్ సైతం స్పందించాడు.
రాకేష్ మాస్టర్ ఊత పదం జఫ్ఫా. ఆయన తన ఇంటర్వ్యూల్లో ఎక్కువగా వాడేది అదే. కొత్త కొత్తగా తిట్టడంలోనూ రాకేష్ మాస్టర్ దిట్టే. అయితే ఆ జఫ్పాను చంటి బాగా పట్టాడు. స్కిట్ మొత్తంలో ఆ ఒక్క పదాన్నే బాగా హైలెట్ చేశాడు. బుల్లెట్ భాస్కర్, షకలక శంకర్‌లపై తిట్ల వర్షాన్ని కురిపించాడు.
ఇక వీటిపై తాజాగా రాకేష్ మాస్టర్ స్పందించాడు. తనను ఇమిటేట్ చేయడంపై రాకేష్ మాస్టర్ లైట్ తీసుకున్నాడు. రోజా కూడా మనోకు ఏదో చెబుతోందని, మొత్తానికి తనను బాగానే ఫాలో అవుతున్నారని, తనను ఇమిటేట్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here