Home gossips ఆ ప్రశ్నకు విలేకరిపై పేపర్ విసిరికొట్టిన రోజా.. అది మగాళ్లు చేస్తే తప్పులేదు.. నేను చేస్తే...

ఆ ప్రశ్నకు విలేకరిపై పేపర్ విసిరికొట్టిన రోజా.. అది మగాళ్లు చేస్తే తప్పులేదు.. నేను చేస్తే తప్పా అంటూ..

273
0

జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే రోజా.. టీడీపీ వాళ్లు అడిగే ప్రశ్నల్ని తన దగ్గరకు మోసుకుని రావొద్దని.. వాళ్లు ఉన్నది 10 శాతం మందే అని.. తనని అభిమానించే వాళ్లు 90 శాతం మంది ఉన్నారన్నారు రోజా. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

అసలు రోజా.. ఎమ్మెల్యే అనుకుంటుందా?? జబర్దస్త్‌లో ఆ డాన్స్‌లు ఏంటి?? ఆ డ్రెస్‌లు ఏంటి?? అంటూ సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు ట్రోల్ చేస్తున్నారంట.. ఇదే ప్రశ్నను ఫాపం ఆ విలేకరి డైరెక్ట్‌గా ఎమ్మెల్యే రోజానే అడిగే సరికి ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. చేతిలో ఉన్న పేపర్‌ని విసిరికొట్టి.. ఏంటి బాబూ నీ ప్రశ్న?? తెలుగుదేశం వాళ్లు అడిగే ప్రశ్నల్ని నా దగ్గరకు మోసుకురావద్దు.. నేను ఇప్పటికే ఈ విషయంపై చాలాసార్లు చెప్పాను.. ప్రెస్ అంటే నాకు గౌరవం ఉంది.. కాని ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేయొద్దు’ అంటూ సీరియస్ అయ్యారు. మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి లేని అభ్యంతరం మీకెందుకు?? ఒక వేళ జబర్దస్త్‌నా? రాజకీయమా అంటే?? నా ప్రయాణం రాజకీయాలవైపే అంటూ వివరణ ఇచ్చారు రోజా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here