Home Life జీవిత అభివృద్ధి-మహిళల విజయాలు

జీవిత అభివృద్ధి-మహిళల విజయాలు

268
0

ఎవరైనా ఉన్నత శిఖరాలు అధిరోహించాలనుకుంటారు. కొందరు మాత్రం నిజమైనా శిఖరాలను అధిరోహించాలనుకుంటారు. అయితే కోపల్‌ గోయల్‌ పర్వతారోహణ చేయాలనుకుంది.

ఆడపిల్ల అయినందున ఆమె ప్రయత్నం ప్రారంభంలోనే ఆగిపోయింది. సరైన ప్రోత్సాహం లేక మానసికంగా కుంగిపోయింది.

ఇంకెవరు తనలా బాధపడకూదని ఈ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రపంచానికి తెలిపేందుకు ఒక డాక్యుమెంటరీ తీసింది.

అత్యంత సాహసవంతమైన 11 రకాల క్రీడల్లో 14 మంది భారతీయ మహిళలు సాధించిన విజయాలను ‘వైల్డ్‌ఉమెన్‌ పేరుతో చిత్రీకరించింది.

కోపల్‌ గోయల్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, అడ్వటైజింగ్‌ జర్నలిజంలో డిగ్రీ చేసింది.

తర్వాత ఒక మీడియా నెట్‌వర్‌కలో వీడియో ఎడిటర్‌గా పనిచేసింది. కొంతకాలానికి ఆ ఉద్యోగం మానేసి ఒకే దగ్గర కూర్చుని చేసే ఉద్యోగం ఆమెకు తృప్తినివ్వలేదు.

పైగా ఫొటోగ్రఫీ, ఫిలిం మేకింగ్‌ అంటే ఆమెకు ఎంతో ఆసక్తి. తన దగ్గరి బంధువుచదువులో సలహాలు ఇస్తుండేవాడు. అతను బ్యాంకు

ఉద్యోగ పరీక్షకలు సిద్ధం కావాల్సిందిగా సలహా ఇచ్చాడు. వాటిని సిద్ధమవుతున్న సమయంలోనే ఒక ఫ్రెంచ్‌ మౌంటేనర్‌ గురించి పత్రికలో చదివిన కోపల్‌ ఆమె సాహసాలు చదివి స్ఫూర్తి పొందింది.

2010లో ఎనిమిది వేల మీటర్ల ఎత్తుగల పర్వతాన్ని అధిరోహించిన మొదటి మహిళ ఆమె. ఆమె గురించి చదివి కోపల్‌ ఆలోచన మారిపోయింది.

ఇలాంటి ప్రత్యేకమైన క్రీడల్లో అడ్వెంచర్లు సృష్టిస్తున్న భారతీయ మహిళలపై పరిశోధన మొదలుపెట్టింది.

జమ్మూకాశ్మీర్‌లోని జవర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలోని సోనామార్గ్‌ అనే మౌంటెనర్‌ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ కోసం చేరింది.

ఆ ట్రైనింగ్‌ తీసుకుంటున్న సమయంలో మౌంటెనింగ్‌పై మరింత ప్రేమ పెరిగింది. నెల రోజుల ట్రైనింగ్‌ పూర్తి చేసుకుని ఎయిర్‌ఫోర్స్‌లోని అడ్వంచర్‌ టీంలో సభ్యురాలిగా చేరింది.

అందుకు సంబంధించిన పరీక్షలో ఉత్తీర్ణ సాధించలేకపోయింది. దాంతో మళ్లీ తన రీసర్స్‌ కొనసాగించింది.

మనదేశంలో ఇలాంటి సాహవంతమైన క్రీడల ప్రాధాన్యం గురించి విస్తారమైన అధ్యయనం చేసింది. పర్వతారోహణ చేయడంలో మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తమకు ఇష్టమైన ఈ రంగాన్ని ఎందచుకోవడానికి ఎంతటి పోరాటాన్ని చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవడమే ఆమె లక్ష్యంగా మారిపోయింది.

ఢిల్లీ చేరుకుని స్పోర్ట్స్‌ క్లెంబింగ్‌ తరగతుల్లో చేరింది. అక్కడ తన జీవనాధారం కోసం యోగా క్లాసులు చెప్పేది. రెండు సంవత్సరాలు పూర్తిగా ఇందులోనే ఉండిపోయింది.

జోనల్‌, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నది. కోపల్‌ తల్లిదండ్రులు ఆందోళన చెందేవారు కూతులు యోగా క్లాసులు చెప్పడం, పర్వతాలు అంటూ కొండలు, గుట్టలు చుట్టూ తిరగడం వారికి ఇబ్బందిగా అనిపించింది.

ఆమె భవిష్యత్‌ గుఇరంచి పెళ్లి గురించి దిగులుపడేవారు. పైగా ఆడపిల్ల ఒంటరిగా ఉండటం వారికి మరింత భయాన్ని కలిగించింది. దాంతో ఇంటికి వచ్చేయమని ఆమెపై ఒత్తిడి తెచ్చేవారు.

తన ఇష్టాన్ని చంపుకుని ఇంట్లో వారిని ఒప్పించలేక కోపల్‌ ఎంతో బాధను అనుభవించేది.

కొంత కాలం నిద్రాహారాలు మాని మానసికంగా కుంగిపోయింది. ఇక చేసేది లేక తన రీసెర్చ్‌ను, శిక్షణను అంతటితో వదిలేసింది. తర్వాత ఏం చేయాలనే ఆలోచన మళ్లీ మొదలయింది.

ఏది ఏమైనా ఈ రంగాన్ని వదలవద్దని ‘వైల్డ్‌ ఉమెన్‌ అనే ప్రాజెక్ట్‌ మొదలుపెట్టింది. ఎలాగో ఫిలిం మేకింగ్‌లో ఆసక్తి ఉంది కాబట్టి ఆ వైపు తన పని మొదలుపెట్టింది.

అడ్వెంచర్‌ రంగంలో అడుగపెట్టలేక తను ఎంతో వేధనకు గురయింది.

సరైన ప్రోత్సాహం లేక తన కోర్కెలను చంపేసుకుంది. అప్పటికే ఈ రంగంలో రాణిస్తున్న మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వాటిని ఎలా అధిగమించారు.

అనే అంశాలను తీసుకుని వారి జీవితాలను ఒక డాక్యుమెంటరీ ఫిలిం తీయాలనుకుంది.

భారతదేశంలో మౌంటెనింగ్‌ చేసే మహిళలు ఎంత మంది ఉన్నారో తెలుసుకుని వారి వద్దకు వెళ్లి వారి జీవితాలను దగ్గరగా పరిశీలించడం మొదలుపెట్టింది.

నిత్యం వారితో ప్రయాణించడం వారితోనే గడపడంతో భోజానికి, వసతికి కోపల్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంతకాలం గడిచిపోయింది.

నాలాగే ఎంతో మంది మహిళలు ఈ రంగంలో రాణించాలని కోరుకుంటున్నారు .

అయితే ఈ రంగంలో రాణించడమంటే మహిళలకు అంత సులువ కాదు. ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

వారు వారి జీవితాల్లో ఎదుర్కొన్న సమస్యల గురించి తెలసుకోవాలకుంటున్నా వారికి ఎదురైన సమస్యలను ఎలా జయించగలిగారు అనేవి ఈ ప్రపంచానికి తెలియజేయాలి.

దీని కోమే ‘వైల్డ్‌ ఉమెన్‌ అనే నాప్రయాణం మొదలుపెట్టాలను అంటుంది కోపల్‌.

డాక్యుమెంటరీని బయటకు తీసుకురావడం కోపల్‌ జీవితాశయం. పదకొండు రకాల అడ్వెంచర్లు 14 మంది మహిళల జీవితాలను ఇందులో చిత్రీకరించింది.

మంచు పర్వతాలు, సర్ఫింగ్‌, రాక్‌ క్లైమింగ్‌, లాంగ్‌ బోర్డింగ్‌ లాంటి అనేక రకాల సాహసక్రీడలు చేసిన వారి గురించి అధ్యయనం చేసి డాక్యుమెంటరీ తీసింది.

భారతదేశ వ్యాప్తంగా అథ్లెట్లు, ఎదుర్కొన్న కష్టాల గురించి మనం ఇందులో చూడవచ్చు. ఉత్తరాఖండ్‌కు చెందిన 16 యేళ్ల ఓ సర్ఫర్‌ నుండి 30 యేళ్ల తల్లుల జీవిత పోరాటాలు ఇందులో ఉన్నాయి.

తమ యోగా టీచర్‌గా పనిచేసి సంపాదించిన డబ్బుతో ఈ డాక్యుమెంటరీని పూర్తి చేయాలనుకుంది. అయితే అది సాధ్యం కాలేదు. దాని కోసం ప్రజల వద్ద చందాలు వసూలు చేయాలనుకుంది.

ఇలాంటి రంగంలో మహిళలకు పెద్దగా ఆదరణ లేదు కాబట్టి ఈ డాక్యుమెంటరీ విజయవంతం కాదంటూ చాలామంది ఆమెను నిరుత్సాహపరిచారు.

అయినా పట్టుదలతో తన డాక్యుమెంటరీని పూర్తి చేసింది. కోపల్‌ 2017లో డాక్యుమెంటరీ మొదలు పెట్టింది. దీనికోసం ఎన్నో ఇబ్బందులు ఎదర్కొన్నది. పూర్తి చేయడానికి రెండేళ్లు పట్టింది.

చివరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రం ప్రదర్శించబడింది. ఎన్నో అవార్డులు అందుకుంది. 2019లో కెన్యాలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిలం స్పోర్ట్స్‌ ఫెస్ట్‌వల్లో ‘వైల్డ్‌ఉమెన్‌ బెస్డ్‌ డాక్యుమెంటరీ ఎంపికయింది.

గత నెలలో లండన్‌లో జరిగిన మౌంటెన్‌ ఫిలిం ఫెస్టివల్‌లో పీపుల్‌ ఛాయిస్‌ అనే అవార్డును గెలుచుకుంది. అలాగే ముంబయిలోని కాలా ఘోడా ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది.

అడ్వెంచర్‌ రంగంలో రాణిస్తున్న మహిళల జీవితాలు ఈ ప్రపంచానికి తెలియజేయడం కోసమే కోపల్‌ ఈ డాక్యుమెంటరీని చిత్రీకరించి దీన్ని వీలైనంత వరకు విసాతరంగా ప్రచారం చేసే ప్రయత్నం చేసింది.

పాఠశాల అమ్మాయిలకు, గ్రామీణ, పట్టణ మహిళలకు ఈ డాక్యుమెంటరీని చూపించేందుకు కృషి చేసింది.

మహిళలు శక్తిహీనులు, ఎలాంటి ధైర్యసాహసాలు చేయలేరు అనే ఆలోచ మన దేశంలో ఎక్కువగా ఉంది.

ప్రజల్లో ఉన్న ఇలాంటి ఆలోచనల్లో మార్పులు తీసుకురావాలి దీనికోసమే కోపల్‌ ‘ఇన్త్ప్సెర్‌ క్రూ అనే ఒక వెబ్‌సైట్‌ను కూడా మొదలు పెట్టింది.

అడ్వెంచర్‌ రంగంలో రాణిస్తున్న మహిళల విజయాలను అందులో పెట్టేది.

ఇలాంటి ప్రత్యేకమైన ధైర్యసామసాలతో కూడుకున్న క్రీడల్లో మహిళలకు ఉన్న గుర్తింపు, ప్రోత్సాహం, వాటిపై అవగాహన కల్పించడం ఈ వెబ్‌సైట్‌ ముఖ్య ఉద్దేశం. ఉద్దేశ్యం

కోపల్‌ ఎక్కువ మంది మహిళలను ఈ రంగంలోకి ప్రవేశించడాన్ని ప్రోత్సహించడం మరియు వయస్సు లేదా లింగంతో సంబంధం లేకుండా సాహసోపేతమైన సాహసాలను ప్రోత్సహించడం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here