తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 1,763 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 8 మంది మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 95,700 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా తెలంగాణలో 710 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 20,990 ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 73,991 గా ఉంది. హైదరాబాద్ లో 474 కేసులు నమోదయ్యాయి. మొత్తం ఎనిమిది లక్షల వరకూ కరోనా టెస్ట్ లను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది.ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.