ఇప్పుడే కులం గుర్తుకు వచ్చిందా?

0
144

ప్రతి దానికి కులం రంగు పూయడం చంద్రబాబుకు అలవాటయిందని టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. చంద్రబాబు కమ్మ సామాజిక వర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడన్నారు. ఆయన ఫోన్ ను ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉందన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో పరిశ్రమ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలన్న చంద్రబాబు రమేష్ ఆసుపత్రి విషయంలో ఆ డిమాండ్ ఎందుకు చేయడం లేదన్నారు. దుర్ఘటన జరిగింది కాబట్టి కేసులు నమోదు చేస్తారన్నారు. దానికి కులం రంగు పులిమితే ఎలా అని వల్లభనేని వంశీ ప్రశ్నించారు. రమేష్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం చేస్తున్నారా? ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించినప్పుడు జగన్ మంచితనం కన్పించలేదా? అని ప్రశ్నించారు. ఇలాంటి ఆసుపత్రులపై తెలంగాణలోనూ చర్యలు తీసుకున్నారని, అక్కడ మాత్రం చంద్రబాబు నోరు మెదపడం లేదని వల్లభనేని వంశీ ఫైర్ అయ్యారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here