తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 26 వేల 767 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. 1967 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల లక్షకు చేరువైంది. కరోనా కారణంగా నిన్న 8 మంది మృతి చెందారు.
ఇప్పటివరకు తెలంగాణలో 99 వేల 391 మంది కరోనా వైరస్ బారిపడగా.. 737మంది మృతి చెందారు. బాధితుల్లో ఇప్పటి వరకు76 వేల 967 మంది కోలుకోగా.. మరో 21 వేల 687 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇందులో 15 వేల 332 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 8 లక్షల 48 వేల 78 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.