Jabardasth: ఆ కుటుంబానికి కాడెద్దులు గిఫ్ట్… షకలక శంకర్ పెద్ద మనసు.. ఆ కుటుంబానికి కాడెద్దులు గిఫ్ట్

0
36

టాలీవుడ్‌లో దర్శకత్వం విభాగంలో పనిచేసే బైరు సిద్దు అనే యువకుడి కుటుంబ పరిస్థితి చూసి షకలక శంకర్ చలించిపోయాడు. ఈ క్రమంలోనే వారిని ఆర్థికంగా ఆదుకున్నాడు.

జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ పెద్ద మనసు చాటుకున్నాడు. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తూ నలుగురికీ ఆదర్శంగా నిలిచాడు. ఓ నిరుపేద కుటుంబానికి కాడెద్దులతో పాటు నాగలి అందించాడు శంకర్. టాలీవుడ్‌లో దర్శకత్వం విభాగంలో పనిచేసే బైరు సిద్దు అనే యువకుడి కుటుంబ పరిస్థితి చూసి షకలక శంకర్ చలించిపోయాడు. ఈ క్రమంలోనే వారిని ఆర్థికంగా ఆదుకున్నాడు. లక్షా ఇరవై వేల రూపాయలతో కాడెద్దులు, నాగలి కొని ఆ కుటుంబానికి సాయం చేశాడు. బైరు సిద్దు స్వస్థలం నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామానికి వెళ్లి స్వయంగా తన చేతులతో అందేశాడు షకలక శంకర్. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీతో పాటు పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. శంకర్ దాతృత్వం, సేవాగుణాన్ని వారంతా అభినందించారు.

ఒకప్పుడు జేబులో పది రూపాయలు కూడా లేక అల్లాడిపోయాడు. ఆ పరిస్థితి నుంచి లక్షా పది వేలతో ఓ కుటుంబంలో వెలుగులు పంచే స్థోమత కల్పించిన కళామతల్లికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇకపై నా సంపాదనలో పావు వంతు సేవా కార్యక్రమాలకు కేటాయించాలని నిర్ణయించుకున్నా. భగవంతుడు ఆ శక్తిని ప్రసాదించాలని వేడుకుంటున్నా.
— షకలక శంకర్

షకలక శంకర్ జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సంచలన దర్శకుడు ఆర్జీవీని అనుకరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ కమెడియన్‌గా నటించి మెప్పించాడు. శంభో శంకర సినిమాలో హీరోగానూ నటించాడు. ఇటీవల ఆర్జీవీ పవర్ స్టార్ మూవీకి కౌంటర్‌గా నూతన నాయుడు తీసిన పరాన్నజీవి చిత్రంలో లీడ్ రోల్ పోషించాడు. జబర్దస్త్‌కు కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన శంకర్.. లాక్‌డౌన్ తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here