పవన్‌కి చంద్రబాబు బర్త్‌డే విషెస్: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం..

0
182

పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా ఆయన బర్త్‌డే విషెస్ తెలియజేశారు.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడమే. ‘‘పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలను, ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను’’ అని చంద్రబాబు ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పారు. అయితే, మే నెలలో ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ఆయనకు చంద్రబాబు విషెస్ చెప్పలేదు. ఇప్పుడు ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెరపైకి తీసుకొచ్చారు.

‘‘ఈ మధ్య అందరు హీరోలకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే మీకు మా ఎన్టీఆర్ అన్న పుట్టినరోజు గుర్తులేదా. మీరు ఇలా చేయడం ఏమీ బాగాలేదు. చాలా బాధగా ఉంది’’ అంటూ తారక్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కొంత మంది ఇలా చాలా సాఫ్ట్‌గా కామెంట్లు పెడుతుంటే మరికొందరు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరుష పదజాలంతో కామెంట్లు పెడుతున్నారు. చంద్రబాబును తిట్టిపోస్తున్నారు. చంద్రబాబు తరవాత పార్టీని నడిపించే శక్తి, సామర్థ్యం ఒక ఎన్టీఆర్‌కే ఉందని.. కాబట్టి, ఇకనైనా చంద్రబాబు మారాలని, ఎన్టీఆర్‌కు మర్యాద ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు చాలా మంది టీడీపీ ఫాలోవర్లకు ఈ విషయంలోనే చంద్రబాబు నచ్చడం లేదని కామెంట్లు పెడుతున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here