Dhee Dance Show ఆనీ మాస్టర్‌కు నడిరోడ్డుపై షాకింగ్ ఘటన..అందరూ చూస్తుండగానే..

0
188

ఆనీ మాస్టర్ ఈశాన్య రాష్ట్రానికి చెందిన మహిళ కావడంతో ఆమె చూసేందుకు చైనీస్ వ్యక్తి లాగా ఉంటారు. కాగా ఆమె రూపమే ఆమెకు శాపంగా మారిందని ఇటీవల ఆమె యాంకర్ సుమ టీవీలో షోలో చెప్పుకొని కన్నీరు పెట్టుకున్నారు.

ఢీ డాన్స్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన మాస్టర్లలో ఆనీ మాస్టర్ కూడా ఒకరు. లేడీ కొరియోగ్రాఫర్లలో ఆనీ మాస్టర్ కు మంచి పేరుంది. బాలకృష్ణ నటించిన పైసా వసూల్ సినిమాలో కొరియోగ్రాఫర్ గా పేరు పొందిన ఆనీ మాస్టర్ కు బుల్లితెరపై మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఆనీ మాస్టర్ ఈశాన్య రాష్ట్రానికి చెందిన మహిళ కావడంతో ఆమె చూసేందుకు చైనీస్ వ్యక్తి లాగా ఉంటారు. కాగా ఆమె రూపమే ఆమెకు శాపంగా మారిందని ఇటీవల ఆమె యాంకర్ సుమ టీవీలో షోలో చెప్పుకొని కన్నీరు పెట్టుకున్నారు. తాము భారతీయులమేనని, కానీ చాలా మంది తమను చైనీస్ అంటూ వెక్కిరిస్తుంటారని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన స్టూడెంట్స్, అలాగే ఉద్యోగులను చైనీస్ అంటూ వేధింపులకు గురి చేస్తుంటారని ఆమె చెప్పుకొని వాపోయారు. ఇదిలా ఉంటే తాజాగా ఆమె పార్టిసిపేట్ చేసిన క్యాష్ ప్రోగ్రాంలో మరో కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ కూడా ఆనీ మాస్టర్ ను పట్టుకొని చైనీస్ బొమ్మ అంటూ టీచ్ చేశాడు. దానిపై ఆనీ మాస్టర్ అసహనానికి గురైంది. తాము భారతీయులమే అని, చైనాకు చెందిన వారం కాదని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ఇటీవల ఆమె తన పిల్లలకు ఆన్ లైన్ క్లాసుల సందర్భంగా పుస్తకాలు కొనేందుకు మెహదీపట్నం వెళ్లగా, అక్కడ కొందరు తనను చూసి చైనీస్ మహిళ అంటూ వ్యాఖ్యానించారని, అంతటితో ఆగకుండా అదిగో కరోనా వైరస్ వెళుతోంది అంటూ అవమానించారని కన్నీళ్ల పర్యంతం అయ్యింది. దీంతో యాంకర్ సుమ ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్ట కరమని ఆమె బాధను సర్ది చెప్పే పనిచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here