సింగల్ షెడ్యూల్ తో రకుల్ పనైపోతుంది!!

0
171

నిన్నమొన్నటివరకు కరోనా తో స్తబ్దుగా ఉన్న సినిమా షూటింగ్స్ నెమ్మదిగా మొదలవుతున్నాయి. ఇప్పటికే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సోలో బెటర్ సో బ్రతుకు తో సెట్స్ మీదకెళ్ళగా సందీప్  కిషన్ కూడా A1 ఎక్స్ప్రెస్ షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. తాజాగా క్రిష్ కూడా పవన్ కళ్యాణ్ మూవీ ని పక్కనబెట్టి అయన మేనల్లుడు వైష్ణవ తేజ్ తో మరో మూవీ మొదలు పెట్టాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ ని తీసుకున్నారు. రకుల్ ప్రీత్ కి అవకాశాలు లేవనుకున్న ప్రతిసారి ఏదో ఒక అవకాశం రకుల్ ప్రీత్ ని నిలబెడుతుంది.

మరి వైష్ణవ తేజ్ తో క్రిష్ మూవీ చాలా త్వరగా పూర్తి కాబోతుందట. ఇప్పటికే రకుల్ ప్రీత్ క్రిష్ మూవీ కోసం వికారాబాద్ అడవులకి వెళ్ళింది. వైష్ణవ తేజ్ తో రకుల్ కాంబో సీన్స్ ని క్రిష్ ఆఘమేఘాల మీద పూర్తి చేస్తున్నాడు. అయితే ఈ సినిమాని క్రిష్ సింగిల్ షెడ్యూల్ లో కేవలం 40 రోజుల్లో పూర్తి చేయబోతున్నాడట. అంటే రకుల్ ప్రీత్ ఏకధాటిగా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతుంది. అంటే చాలా తక్కువ డేట్స్ కోసమే రకుల్ ఈ సినిమాకి తీసుకున్నారు. మరి క్రిష్ కేవలం 40 రోజుల్లోనే ఈ సినిమా తీసి విడుదలకు ప్లాన్ చేస్తాడట. అంటే సింగిల్ షెడ్యూల్ కే రకుల్ తో క్రిష్ ముగించేస్తాడన్నమాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here