తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి అలాగే కొనసాగుతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 62 వేల 132 మందికి పరీక్షలు నిర్వహించగా.. 2511 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. మరో 3,145 మంది పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. తాజా కేసులతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన బాధితుల సంఖ్య లక్షా 38 వేల 395కి చేరింది. మరోవైపు నిన్న ఒక్కరోజే కరోనాతో 11మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల 877కి పెరిగింది.
మరోవైపు నిన్న కరోనా నుంచి 2579 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య లక్షా 4 వేలు దాటింది. ప్రస్తుతం తెలంగాణలో 32 వేల 915 మంది చికిత్స పొందుతుండగా, ఇందులో 25 వేల 729 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 305 వెలుగుచూడగా.. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 184, నల్లగొండ- 170, కరీంనగర్- 150, ఖమ్మం- 142, మేడ్చల్ – 134, వరంగల్ అర్బన్- 96, సూర్యాపేట- 96, కొత్తగూడెం- 93, నిజామాబాద్- 93, జగిత్యాల- 85, సిద్దిపేట జిల్లాలో 80 చొప్పున కేసులు నమోదయ్యాయి.