రవితేజ సరసన నిధి – లావణ్య?

0
299

రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న కిలాడీ ముచ్చట్లు సోషల్ మీడియాలో రోజుకో రకంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో రవితేజ డ్యూయెల్ రోల్ చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తుండగా.. రవితేజ కి తోడు మరో యంగ్ హీరో ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఉందని… ఆ పాత్ర కోసం శ్రీ విష్ణు అయినా, లేదంటే మరో యంగ్ హీరోని తీసుకుంటారనే ప్రచారం జరుగుతుండగా.. తాజాగా హీరోయిన్ పూజ హేగ్డ్ ని రవితేజ ఖిలాడీ కోసం సంప్రదించారని న్యూస్ నడిచింది. ప్రస్తుతం బిజీగా వున్న పూజ హెగ్డే రవితేజ తో చెయ్యడానికి ఒప్పుకుంటుందా అనే అనుమానము కలిగేలా న్యూస్ లు పచారంలోకొచ్చాయి.

అయితే తాజాగా రవితేజ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్న ఈ సినిమాలో ఓ పాత్రకి నిధి అగర్వాల్, మరో పాత్రకి లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటించనున్నారనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇస్మార్ట్ హిట్ తర్వాత నిధి అగర్వాల్ కి మళ్ళీ అలాంటి మాస్ అవకాశం కలగలేదు. ఇక లావణ్య త్రిపాఠికి ఇప్పటివరకు గ్లామర్ రోల్ చేసే ఛాన్స్ తగల్లేదు. ఇక నిధి అందాలు, లావణ్య క్యూట్ లుక్స్ రవితేజ కి ప్లస్ కానున్నాయని అంటున్నారు. రాక్షసుడు హిట్ తో మంచి హుషారుగా ఉన్న రమేష్ వర్మ రవితేజ ని పక్కా మాస్ గా చూపించే ఏర్పాట్లు చేస్తున్నాడట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here