చిత్తూరులో నాగచైతన్య, సాయిపల్లవి!

0
145

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, `ఫిదా` బ్యూటీ సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న చిత్రం `లవ్‌స్టోరీ`. కరోనా లాక్‌డౌన్‌ గ్యాప్‌ తర్వాత తిరిగి ఇటీవలే ఈ చిత్ర రెగ్యులర్‌ షూట్‌ మొదలైంది.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చిత్తూరు జిల్లా ఐరాల జలపాతం దగ్గర జరుగుతున్నట్లుగా ఓ వీడియో బయటికి వచ్చింది. వాటర్‌ జలపాతంలో జరిగిన యాక్సిడెంట్‌ను చిత్రీకరణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరికొన్ని రోజుల పాటు చిత్రయూనిట్‌ ఇదే ప్రాంతంలో చిత్రీకరణ జరపనుందని టాక్‌. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here