గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం టాలెంట్ గురించి తెలియంది కాదు. మల్టీ టాలెంటెడ్ పర్సన్. సింగర్, నటుడు, సంగీత దర్శకుడు, నిర్మాత.. వీటన్నింటికీ మించి మంచి వ్యక్తి. ఆయన లేరంటే ఇప్పటికీ ఎవ్వరూ నమ్మలేని పరిస్థితి. అంతలా ఆయన తన పాటతో ఓలలాడించారు. బాలుకి ఆరోగ్యం బాగోలేదని తెలిసినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ.. ఆయన క్షేమంగా హాస్పిటల్ నుంచి వచ్చి.. ఎప్పటిలానే తన గాత్రంతో అలరించాలని ప్రార్థనలు చేశారు.. చేస్తూనే ఉన్నారు.
గుర్తుపట్టలేనంతగా..
కాస్త కోలుకున్నారని చెప్పగానే అంతా సంతోషించారు కానీ.. సడెన్ ఆయన ఇలా అందరినీ వదిలేసి వెళ్లిపోతారని ఎవ్వరూ ఊహించలేదు. ఆయన లేరని తెలిసి సంగీత ప్రపంచం మూగబోయింది. ఆయన పార్థీవ దేహం చూసి కన్నీళ్లతో అందరూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన భౌతికకాయం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. బాలు భౌతికకాయాన్ని చూసిన మిత్రులు, ఆప్తులు కన్నీరుమున్నీరవుతున్నారు.