Home Entertainment పవన్ ఫ్యాన్స్ కులాన్ని తీసుకువస్తారు కానీ.. దాసరి మా తాతని నేను చెప్పుకోలేదు: దేవి నాగవల్లి

పవన్ ఫ్యాన్స్ కులాన్ని తీసుకువస్తారు కానీ.. దాసరి మా తాతని నేను చెప్పుకోలేదు: దేవి నాగవల్లి

221
0

ఆ ఛానల్‌లో పనిచేయడమే యాంకర్ దేవికి శాపం అయ్యిందా?? దేవి ఎలిమినేషన్‌కి పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కి సంబంధం ఏంటి?? దాసరి నారాయణ రావుతో దేవికి ఉన్న బంధుత్వం ఇప్పుడే బయటకు రావడానికి కారణం??

 బిగ్ బాస్ సీజన్ 4లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న టీవీ 9 యాంకర్ దేవి నాగవల్లిని ఎలిమినేట్ కావడం బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఆమెకు ఓట్లు వచ్చినా కావాలనే ఎలిమినేట్ చేశారనే ఆరోపణలతో పాటు.. ఆమె టీవీ 9 ఛానల్‌ యాంకర్ కావడం వల్లే ఎలిమినేట్ అయ్యిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ తరుణంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దేవి నాగవల్లికి ఓట్లు పడకుండా చేశారని ప్రచారం నడుస్తోంది. శ్రీరెడ్డి ఇష్యూతో పాటు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కి డ్యామేజ్ చేసేలా టీవీ 9లో చాలా వార్తలు ప్రసారం చేశారని.. ఆ వార్తలు చదివింది.. ఇంటర్వ్యూలు చేసింది దేవి నాగవల్లి కావడంతో ఆమెను పనికట్టుకుని ఎలిమినేట్ చేశారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీటిపై స్పందించారు దేవి నాగవల్లి. ఈ తరుణంలో తను దాసరి మనవరాలు అనే విషయాన్ని సీక్రెట్‌గా ఎందుకు ఉంచాల్సి వచ్చిందో తెలియజేశారు దేవి నాగవల్లి.
ప్రొఫెషన్ పరంగా కాకుండా వ్యక్తిగా చూశారు.. ఇప్పుడు నేనేంటో అందరికీ అర్థమైంది కాబట్టి ఆట పరంగా ఓడించి.. వ్యక్తిత్వపరంగా నన్ను గెలిపించిన వాళ్లకి చాలా థాంక్స్. బిగ్ బాస్ వాళ్లు నాకు ఓట్లు తక్కువ వచ్చాయని చెప్పారు.. నేను వాళ్లని నమ్మాను. కాని ఎలిమినేషన్ స్పెషల్ వీడియో అప్పటికప్పుడు చేశాం అన్నారు.. నాకు అనుమానం వచ్చింది. తీరా బయటకు వచ్చాక.. సోషల్ మీడియాలో నాకు ఎంత సపోర్ట్ ఉందో.. నాకు వచ్చిన ఓటింగ్‌ను స్క్రీన్ షాట్‌లతో సహా పంపారు.. అప్పుడు అర్థమైంది.. అది జన్యున్ ఓటింగ్ కాదని. నేను బిగ్ బాస్ షోని నమ్మి వెళ్లా.. నేను ఎక్కడా డ్రామా చేయలేదు. జనం నన్ను తిట్టుకుని ఓట్లు వేయలేదో అనుకుని బాధపడ్డా.. కాని బయటకు వచ్చిన తరువాత అసలు విషయం తెలిసింది. ఏదేమైనా నేను బలైపోయాను.
నేను ఎలిమినేట్ కావడానికి నేను పనిచేసే ఛానల్ అంటున్నారు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు.. ఇంకా ఏవో రీజన్స్ చెప్తున్నారు. ఎలిమినేషన్ అనగానే నా బాధను ఎలా ఎక్స్ ప్రెస్ చేయాలో అర్థంకాలేదు. చాలా హర్ట్ అయ్యాను.

నేను టీవీ9లో పనిచేస్తున్నానని అది నచ్చక ఓట్లు వేయకుండా వేయనీయకుండా చేశారంటే అది చాలా తప్పు. ఇప్పటికైనా రియలైజ్ అయ్యారని భావిస్తున్నా. ఎలిమినేట్ చేయడం ద్వారా నన్ను శిక్షించి ఉండొచ్చు. కాని బాధపడేది కూడా మీరే. నాపై నెగిటివ్ ప్రచారం చేసి ఉండొచ్చు.. అలా నన్ను హీరోయిన్‌కి చేస్తుంది మీరే.. నిజంగా పెయిన్, నిజాయితీ ఏంటన్నది నేను ఎలిమినేషన్ అయిన రోజున తెలిసిఉండొచ్చు. ముందే తెలిస్తే.. నన్ను సేవ్ చేసి ఉండేవారు. నన్ను కిందికి దించిన వాళ్లే ఇప్పుడు లేపుతున్నారు.

దాసరి మా తాతయ్య అని చెప్పడానికి కారణం..
బిగ్ బాస్‌కి వెళ్లేముందే వాళ్లు మన డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. ఎవరికీ తెలియని స్టోరీ ఒకటి చెప్పమని అంటారు. అప్పుడు నేను దాసరి నారాయణ రావు మా బంధువు తాత అవుతారని బిగ్ బాస్ వాళ్లకి చెప్పాను. మా అమ్మ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటకు చెప్పింది కానీ.. ఆమె చెప్పకపోయినా.. కొన్నాళ్ల తరువాతైనా బిగ్ బాస్ వాళ్లే చెప్పేసేవారు. దాసరితో కలిసి ఉన్న ఫొటోలు కూడా పంపమని వాళ్లు అడిగారు కూడా.

మా అమ్మ ఈ విషయం ఎందుకు చెప్పిందంటే ఓట్లు వేస్తారని కూడా అనుకుని ఉండొచ్చు. ఇప్పడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని ఇప్పుడు ఒక కమ్యునిటీని తీసుకువస్తున్నారో.. మరి అదే కమ్యునిటీకి చెందిన అమ్మ.. ఇప్పటివరకూ దాన్ని బయటకు చెప్పుకోలేదే. నేను కూడా ఎప్పుడూ చెప్పుకోలేదు. ఎందుకంటే నేను నేనుగా ఉన్నాను కాబట్టి. అలా నన్ను నన్ను చూడమని చెప్పడానికి అమ్మ ఈ విషయం బయటకు చెప్పింది. నేను ఉండి ఉంటే ఆ విషయం చెప్పనిచ్చేదాన్ని కాదు. దేవి నాగవల్లి అనే పేరు నాకు ఉంది. అది వేరే రకంగా వెళ్లడం ఇష్టం లేదు. కాని అమ్మకు తన ఫ్యామిలీ గురించి చెప్పుకోవడం ఇష్టం. ఎందుకంటే.. అమ్మ-నాన్న పెళ్లికి చాలామంది సినిమా పెద్దలు వచ్చారని చెప్పేది. దాసరి, శోభన్ బాబు, జయసుధ చాలా మంది వచ్చిన ఫొటోలు చూపించేది. ఫ్యామిలీ గురించి చెప్పుకోవడం అమ్మకి సంతోషం. అందుకే రిలేషన్ బయటకు చెప్పింది. అంతేతప్ప దాని వల్ల ఏదో అవుతుందని అమ్మ అనుకుని ఉండదు’ అంటూ చెప్పుకొచ్చింది దేవి నాగవల్లి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here