కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ ను తెలంగాణ పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. ప్రభుత్వం చేపట్టిన పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కోసం చేసిన బ్లాస్టింగ్ కారణంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మూడో పంప్ వద్ద పగుళ్లు ఏర్పడటంతో వాటిని సందర్శించేందుకు కాంగ్రెస్ బృందం వెళ్తుంది.
పగిలిపోయిన కల్వకుర్తి పంప్ హౌజ్ లను సందర్శించేందుకు అవకాశం ఇవ్వాలని రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ వాహానాలు దిగేందుకు నేతలు నిరాకరించారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు పర్యటనకు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు భారీగా మొహరించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.