Home Entertainment ఫ్యాషనిస్టా ఎందులోనూ తగ్గదుగా..

ఫ్యాషనిస్టా ఎందులోనూ తగ్గదుగా..

140
0

అక్కినేని కోడలు సమంత అక్కినేని సౌత్ లోనే ది బెస్ట్ ఫ్యాషనిస్టాగా పాపులరైన సంగతి తెలిసిందే. అనుష్క శర్మ.. సోనమ్ కపూర్ తరహాలో సౌత్ లో సామ్ పేరు వినిపిస్తుంది. నిరంతరం ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో రకరకాల డిజైనర్ లుక్ లను షేర్ చేస్తూ గూగుల్ ట్రెండింగులో నిలుస్తున్న భామగా రికార్డులకెక్కుతోంది. సామ్ తనదైన స్టైల్ స్టేట్ మెంట్ తో అందరి దృష్టిని ఆకర్షించడంలో ఎప్పుడూ విఫలం కాదు. ముఖ్యంగా మాస్ కి భిన్నంగా ఎంతో సింపుల్ లుక్ తో క్లాస్సీగా మెప్పించడం తనకే చెల్లింది.

తన కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చినా.. సమంతా అక్కినేని స్టైలింగ్ డెప్త్ అందరికీ నచ్చుతుంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోను షేర్ చేసి ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది సామ్. `బలానికి బలం` అన్న సింపుల్ వ్యాఖ్యతో ఆకర్షించింది. ప్రీతం జుకాల్కర్ రూపొందించిన డిజైన్ ఇది. గ్రీనిష్ ఫ్లోరిస్ డ్రెస్ లో గాలికి ఎగిరే ముంగురులతో ఈ ఫోటోలో సంథింగ్ స్పెషల్ గా సామ్ మంత్రముగ్దులను చేస్తుంది.

ఫిట్నెస్ నుండి ఆరోగ్యం వరకూ.. ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ విషయంలో సామ్ దూకుడు అన్నివేళలా యువతరంలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇటీవల ఆరోగ్యం లైఫ్ స్టైల్ గురించి ఉపాసనతో కలిసి ఓ వెబ్ మాధ్యమం ద్వారా అభిమానులకు గైడ్ చేస్తోంది. ఉపాసన సహా డిజైనర్ శిల్పా రెడ్డితో కలిసి వ్యాయామం ఆనందించడంతో ఫిట్నెస్ వీడియోలను షేర్ చేస్తున్నారు. సమంత నటించిన ఫ్యామిలీమ్యాన్ 2 ఈ దసరా నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇందులో కరుడుగట్టిన మహిళా తీవ్రవాదిగా సామ్ ట్విస్టివ్వనుందన్నది క్యూరియాసిటీ పెంచుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here