ఎక్కడికో తీసుకెళదాం అనుకుంటా, కానీ అక్కడికి రావు: అనసూయపై నవదీప్ షాకింగ్ కామెంట్స్

0
62

సోషల్ మీడియా వచ్చిన తరువాత ఆడియెన్స్ తో పాటు సెలబ్రెటీలు కూడా చాలా క్లోజ్ అయ్యారనే చెప్పాలి. ఇక నెటిజన్లను ఎట్రాక్ట్ చేయడానికి వారు పోస్ట్ చేసే ఫొటోలు వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక అప్పుడప్పుడు లైవ్ చాటింగ్స్ తో అభిమానులకు మరింత దగ్గరవుతుంటారు. ఇక సెలబ్రెటీలు కూడా లైవ్ సెషన్స్ లో పాల్గొని చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇటీవల నవదీప్, యాంకర్ అనసూయ మాట్లాడుకున్న ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నవదీప్ స్పెషల్ ట్రిప్స్.. నవదీప్ బ్యాచిలర్ లైఫ్ ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాడాని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి స్పెషల్ ట్రిప్స్ కూడా వేస్తుంటాడు. ముఖ్యంగా హిమాలయాలు వంటి ప్రదేశాలకు వెళుతూ రిఫ్రెష్ అవుతుంటాడు. ఇదే విషయాన్ని ఇటీవల ఇన్స్టాగ్రామ్ లైవ్ లో అనసూయకు తెలిపారు.

నాకు కూడా వెళ్లాలని ఉంది హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఆ తరువాత శ్రీ నగర్ అలాగే హిమాలయాలకు స్నేహితులతో కలిసి బైక్ ల పైన వెళ్లినట్లు చెప్పిన నవదీప్ 5రోజుల పాటు ఎంజాయ్ చేసినట్లు చెప్పాడు. అయితే మధ్య మధ్యలో అనసూయ మాటలకు నవదీప్ కొన్ని పంచ్ లు కూడా చేశారు. నాకు కూడా అలాంటి ప్రదేశాలకు వెళ్లాలని ఉందని చెప్పగానే నవదీప్ నవ్వుతూ ఒక మాట అనేశాడు.

ఎవరు ఆపినా మీరు ఆపరు ఇక మొత్తం 14 మంది కలిసి బైక్ లపైన వెళ్ళమని చెప్పిన నవదీప్ చాలా ఎంజాయ్ చేసినట్లు చెప్పాడు. ఇక లాక్ డౌన్ లో ఎవరు పనులు ఆపినా మీరు మాత్రమే ఆపేలా లేరని ప్రస్తుతం ఎలాంటి షూటింగ్స్ చేస్తున్నారని నవదీప్ అడుగగా.. ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నట్లు సమాధానం ఇచ్చింది.
గర్ల్ ఫ్రెండ్, వైఫ్ లేకపోతే.. ఇక త్వరలోనే ఒక స్పెషక్ల్ హాంపర్ ని ఇంటికి పంపబోతున్నట్లు చెప్పగా అనసూయ హ్యాపీగా ఫీల్ అయ్యింది. నిజంగా నవదీప్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నావ్. అలా ఎలా..? అని ప్రశ్నించగా గర్ల్ ఫ్రెండ్, వైఫ్ లేకపోతే ఎవడైనా ఇలానే తిరగవచ్చు అంటూ సమాధానం ఇచ్చాడు. మా ఆయన కూడా అలానే అన్నాడు అంటూ సరదాగా మరో సమాధానం ఇచ్చింది అనసూయ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here