జబర్దస్త్ నుండి అవుట్ అయిన కమెడియన్?

0
68

జబర్దస్త్ అంటే కమెడియన్స్ కి ఓ పెద్ద ప్లేట్ ఫామ్. అందులో అవకాశం దొరకాలంటే పెట్టిపుట్టాలి. జబర్దస్త్ కమెడియన్స్ తాము జబర్దస్త్ లోకి ఎంటర్ కావడానికి ఎన్ని బాధలు పడ్డారో అప్పుడప్పుడు చెబుతూనే ఉంటారు. అందుకే చాలామంది కమెడియన్స్ జబర్దస్త్ ని వదలడానికి అసలు ఇష్టపడరు. కానీ బిగ్ బాస్ లో అవకాశం రాగానే జబర్దస్త్ కి పది లక్షల ఫైన్ కట్టి మాస్ ముక్కు అవినాష్ బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు. జబర్దస్త్ లో టీం లీడర్ గా ఉన్న అవినాష్ కి బిగ్ బాస్ గాలం వేసింది. కాస్త ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న అవినాష్ జబర్దస్త్ అగ్రిమెంట్ ని బ్రేక్ చేసి మరీ వచ్చేసాడు. జబర్దస్త్ ని వదిలి వెళ్తూ జబర్దస్త్ ని బాగా కించపరిచిన నాగబాబు ఈమధ్యన జబర్దస్త్ అగ్రిమెంట్ ని బ్రేక్ చేస్తే పది లక్షలు కట్టాలంటూ సెటైర్స్ కూడా వేస్తున్నాడు.

అయితే బిగ్ బాస్ లో కామెడీ చేస్తూ ప్రూవ్ చేసుకున్న అవినాష్ గత రెండు వారాలుగా విపరీతమైన ఆగ్రహంతో హౌస్ మేట్స్ మీద ఊగిపోతున్నాడు. నోయెల్ పోతూ పోతూ అవినాష్ కామెడీ చిల్లర కామెడీ అనడం, దాన్ని అభిజిత్ సపోర్ట్ చెయ్యడంతో అవినాష్ విశ్వరూపం బిగ్ బాస్ లో బయటపడింది. కామెడీ చేస్తా అందుకే పిలిచారు అంటూ అభిజిత్ తో కొట్లాట పెట్టుకున్నాడు కూడా. అయితే గత రాత్రి ఎలిమినేషన్స్ కోసం అవినాష్ నామినేట్ అయ్యాడు. దానితో బిగ్ బాస్ ఆదేశాలు ప్రకారం మిగతా హౌస్ మేట్స్ అంతా అవినాష్, మోనాల్, అభిజిత్, హారిక, అమ్మ రాజశేఖర్ లను మొహం కదపకుండా ఉండేలా వాళ్ళ మీద నీళ్లు పొయ్యడం, మట్టి చిమ్మటం, ఐస్ క్యూబ్స్, కోడి గుడ్లు బ్రేక్ చెయ్యడం చేసినా హౌస్ మేట్స్ ఎవరూ కదలకపోయేసరికి అందరూ నామినేట్ అయినట్లుగా బిగ్ బాస్ ప్రకటించడంతో మాస్ అవినాష్ బాధపడుతూ అందరూ తమ అవకాశాలు, తమని తాము నిరూపించుకోవడానికి చాలా ఫైట్ చేస్తున్నారు అది నచ్చింది.

కానీ నేను ఎలిమినేటి అయితే నాకు చాలా సమస్య, నన్ను ఆ వేరే షో వాళ్ళు ఇక రావొద్దు అన్నారు. నాకు మరొక అవకాశం కూడా లేదు.. ఇదొక్కటే అవకాశం… ఎందుకు అంటే నన్ను ఆ షో వాళ్ళు మళ్ళీ రావొద్దన్నారు అంటూ సోహైల్, అరియనా వద్ద అవినాష్ బాధ పడడం చూస్తుంటే.. ఇక అవినాష్ కి జబర్దస్త్ వెళ్లి నో ఎంట్రీ బోర్డు పెట్టినట్లే అనే అనుమానం వస్తుంది. మరి మంచి లైఫ్ వదులుకుని ఎందుకువచ్చాడో అవినాష్ కే తెలియాలి అంటుంటే.. అవినాష్ ని ఎలిమినేషన్స్ నుండి తప్పించమంటూ జబర్దస్త్ కామెడీ లీడర్స్ అందరూ సోషల్ మీడియాలో అవినాష్ కి సపోర్ట్ చెయ్యమని పోస్ట్ లు పెడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here