అది చంద్రబాబు వంటి నిజాయితీ పరుడికే సాధ్యం

0
73

కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడి కి కేటాయించిన 498 ఎకరాల భూకేటాయింపులు రద్దు చేస్తూ కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. అమరావతిలో బాలయ్య వియ్యంకుడికి అప్పనంగా (కేవలం ఎకరాకు లక్ష రూపాయిలు) భూములు కేటాయించారని అప్పట్లో అధికార పక్షం ఆరోపించింది.

దీనిపై బాలయ్య అల్లుడు… భారత్ ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. “ఒక ఎరువుల ఫ్యాక్టరీ పెట్టడానికి నాన్న గారు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్న టైంలో అప్లికేషన్ పెట్టారు. అందుకు అప్పటి ప్రభుత్వం 498 ఎకరాల భూమిని జగయ్యపేటలో ఎకరాకు లక్ష రూపాయిల చప్పున కేటాయించింది. అయితే భూమిని హ్యాండ్ ఓవర్ చేసే లోగా ప్రభుత్వం మారిపోయింది,” అన్నారు.

“తిరిగి టీడీపీ ప్రభుత్వం దానిని స్టడీ చేసి లక్ష కు ఇవ్వడం కుదరదని పద్నాలుగు లక్షలు ఇవ్వాలని అడిగింది. దానితో కొంత ఆలోచనలో పడ్డాం. సరే అనుకుని తీసుకుందాం అనుకునే సరికి మళ్ళీ ప్రభుత్వం మారిపోయింది. ఆ భూమికి అమరావతికి సంబంధం లేదు. చంద్రబాబు ప్రభుత్వం లక్షకు ఇస్తామని అన్నారని మంత్రులే తప్పుడు ప్రచారం చేస్తున్నారు,” అని భరత్ చెప్పుకొచ్చారు.

“మిగతావన్నీ పక్కన పెడితే… ఎకరాకు లక్ష ప్రొపోజల్ రెడీగా ఉన్నా సొంత వారైనా రేటుని పద్నాలుగు లక్షలకు పెంచడం ఒక్క చంద్రబాబు వంటి నిజాయితీ పరుడికే సాధ్యం. అదే జగన్ అయితే తన వారికి ఊరికే కట్టబెట్టేవారు,” అని టీడీపీ అభిమానులు అంటున్నారు. నిజమే సొంతవారికి కూడా రేటు పెంచి ఇవ్వడం అంటే విశేషమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here