టాలీవుడ్ ప్రముఖులకు ప్రవేశం లేదా?

0
102

మెగా ఫ్యామిలీ లో పెళ్లి అంటే ఆ సందడే వేరు. రామ్ చరణ్, అల్లు అర్జున్, శ్రీజ వివాహాలను మెగా ఫ్యామిలీ ఎంత గ్రాండ్ గా నిర్వహించిందో సామజిక మద్యమాల్లో వైరల్ అయిన ఫొటోస్ ఉదాహరణ. తాజాగా మెగా ఫ్యామిలీ లో నాగబాబు కూతురు నిహారిక పెళ్లి పీటలెక్కబోతుంది. ఆగష్టు లో గుంటూరు రేంజ్ డీజీ ప్రభాకర్ కొడుకు చైతన్య జొన్నల గడ్డ తో నిహారిక నిశ్చితార్ధం కుటుంబ సభ్యుల మధ్యన జరిగింది. ఇక డిసెంబర్ 9 రాత్రి రాజస్థాన్ లోని ఉదయపూర్ లోని ఓ ప్యాలెస్ లి డెస్టినేషన్ వెడ్డింగ్ లో నిహారిక – చైతన్య పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. మరి నిహారిక పెళ్ళికి నాగబాబు ఏ రేంజ్ లో చేస్తాడో అందరికి తెలిసిందే.

అయితే ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖలను మెగా ఫ్యామిలీ నిహారిక పెళ్లి వేడుకలకు పిలవడం లేదని తెలుస్తుంది. కరోనా కారణమా.. లేదంటే మారేదన్నా కారణమా అనేది తెలియదు కానీ.. నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ కి టాలీవుడ్ ప్రముఖులెవరు హాజరు కావడం లేదని సమాచారం. మెగా ఫ్యామిలీ, కొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్యనే నిహారిక పెళ్లి జరగబోతున్నట్టుగా ఫిలింనగర్ టాక్. మరి టాలీవుడ్ పెద్దలను, ప్రముఖలు రాజస్థాన్ తీసుకెళ్లకపోయినా… ఇక్కడ హైదరాబాద్ లో నిహారిక రిసెప్షన్ వేడుకలకు పిలబోతున్నారట. నిహారిక – చైతన్య రిసెప్షన్ అతిథుల మధ్యన అంగరంగ వైభవంగా చెయ్యాలని మెగా ఫ్యామిలీ ప్లాన్ చేస్తుందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here