తెలంగాణ‌లో కొత్తగా 1196 క‌రోనా కేసులు

0
82

తెలంగాణలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. నిన్న రాత్రి 8గంటల వరకు 44 వేల 645 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వ‌హించ‌గా.. కొత్తగా 1,196 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2 ల‌క్ష‌ల 53 వేల 651కి చేరింది. మ‌రోవైపు నిన్న కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా కార‌ణంగా చ‌నిపోయిన వారి సంఖ్య 1390కి పెరిగింది.

కరోనాబారి నిన్న 1745 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రిక‌వ‌రీలు 2.34 ల‌క్ష‌లకు పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 18 వేల 27 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇందులో ప్ర‌స్తుతం15 వేల 205 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో 47.29 ల‌క్ష‌ల క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here