తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 38 వేల 245 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 952 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2 లక్షల 58 వేల 828కి పెరిగింది. అటు కరోనా కారణంగా నిన్న నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,410కి పెరిగింది.
కరోనాబారి నుంచి నిన్న 1,602 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం రికవరీలు 2. 43 లక్షలకు పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 13 వేల 727 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 1 వేల 313 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో 49.29 లక్షలకు పైగా టెస్టులు చేశారు.