Home gossips మూడు వివాహాలు ముగిశాయి .. ఇప్పుడు నాలుగోదా!

మూడు వివాహాలు ముగిశాయి .. ఇప్పుడు నాలుగోదా!

155
0

వనితా విజయ్ కుమార్ అంటే తెలియని వారుండరు. ఆమె మూడో పెళ్లి అంతలా హైలెట్ చేసింది ఆమెని. నటిగా సక్సెస్ కాలేకపోయింది కానీ.. తన పెళ్లిళ్లతో బాగా పాపులర్ అయ్యింది. ఎందుకంటే ఆమె పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడంతో ఎప్పుడు బాగా బిజీ. 2000 లో సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్న వనిత తల్లితండ్రులు విజయ్ కుమార్ – మంజుల ఫ్యామిలీతో దూరంగా ఉంటుంది. తర్వాత మొదటి భర్తతో ఏడేళ్ల సంసారిక జీవితానికి విడాకులతో స్వస్తి చెప్పింది. మొదటి భర్తతో విడాకులైన అదే ఏడాది వ్యాపార వేత్తతో పెళ్లి పీటలెక్కింది. తర్వాత మళ్ళీ నాలుగేళ్లకు అతనికి విడాకులిచ్చిన వనితా విజయ్ కుమార్ మరోసారి పెళ్లి అనకుండా లివింగ్ రిలేషన్ లో గడిపింది.

తర్వాత డాన్స్ మాస్టర్ కి వనిత బ్రేకప్ చెప్పి ఈ ఏడాది లాక్ డౌన్ లో పీటర్ ని పెళ్ళాడి సంచలనాలకు తెర లేపింది. పీటర్ పెళ్లితో వనిత మీడియాకి అడ్డంగా దొరికింది. పీటర్ మొదటి భార్యకి విడాకులివ్వకుండానే వనితని పెళ్లి చేసుకోవడంతో.. అది కాస్త కోర్టుకెక్కింది. కోర్టు కేసు మాత్రమేనా సెలబ్రిటీస్ నుండి కూడా వనిత విజయ్ కుమార్ పై పలుకామెంట్స్ వచ్చాయి. ఆ మూడో పెళ్లి ముచ్చట ముణ్ణాళ్లకే ముగిసిపోయింది. పీటర్ వనితని వదిలి పారిపోయాడు.మరి వనితని పీటర్ వదిలేసిన రెండు నెలలకే మళ్ళీ వనితా విజయ్ కుమార్ ప్రేమలో పడినట్లుగా ట్వీట్ చేసి షాకిచ్చింది. మళ్ళీ ప్రేమలో పడ్డా అంటూ ట్వీట్ చేసిన వనిత.. ఇప్పుడు ఎవరితో ప్రేమాయణం నడుపుతుంది.. అంటూ ఆరాలు మొదలైపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here