సమంత ప్రశ్న.. చిరు సమాధానం

0
111

ప్రస్తుతం ఆహా టాక్ షో సామ్ జామ్ కోసం కష్టపడుతున్న సమంత రోజుకో సెలెబ్రిటీ స్టార్ తో టాక్ షో చేస్తుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, సైనా నెహ్వాల్, తమన్నా, రకుల్, క్రిష్ లాంటి స్టార్స్ ఆహా సామ్ జామ్ షోలో సందడి చేసారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరు సెకండ్ ఎపిసోడ్ కే హాజరయ్యారు. కానీ ఇప్పటివరకు తమన్నా, రకుల్ ఎపిసోడ్స్ ని రివీల్ చేసిన టీం తాజాగా మెగాస్టార్ చిరు ఎపిసోడ్ ప్రోమో వదిలింది. అందులో సమంత చిలిపి ప్రశ్నకు చిరు తడబాటు.. అబ్బో అదిరింది. సమంత కామెడీగా అడిగిన ప్రశ్నకు చిరు సమాధానం నవ్వులు పూయించింది.

సమంత మాట్లాడుతూ చిరుగారు మీ ప్రిజ్ లో ఎప్పుడూ ఉండే ఓ ఐటెం ఏమిటో చెప్పండి అనగానే చిరంజీవి చేతిలో గ్లాస్ టైప్ ఓ మూమెంట్ పెట్టగానే.. అంటే అని సమంత అనగానే.. మీరనుకున్నది కాదు అంటూ చిరు తడబడడం కామెడీగా అనిపించింది. అంటే చిరు తడబాటు చూసిన వారు చిరు వాళ్ళ ప్రిజ్ లో ఇంకేం ఉందొ అంటూ నెటీజన్స్ తెగ కామెడీ చేస్తున్నారు. జస్ట్ చిన్న ప్రోమోతోనే చిరు – సమంత సామ్ జామ్ షో మీద హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది ఆహా టీం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here