సోహైల్ దూకుడును గందరగోళపరుస్తున్నాడు

0
67

బిగ్ బాస్ సీజన్ 4 లో ఎవరికైనా ఎలాంటి అవకాశాలు వచ్చాయో నాకు తెలియదు కాని .. తెలివిగా మూడవ స్థానాన్ని దాటవేసి డబ్బు తీసుకున్న సోహెల్‌కు బిగ్ బాస్ సహాయం అంతగా లేదు. విజేత అభిజిత్, రన్నర్ అఖిల్ తర్వాత ఈ సీజన్‌లో మూడో స్థానంలో నిలిచిన సోహైల్ దూసుకుపోతున్నాడు. అభిజిత్ తో పాటుగా అఖిల్ తో పాటుగా టివి ఛానల్స్ లో కూర్చుని ఇంటర్వూస్ ఇస్తున్న సోహెల్ కి బంపర్ ఆఫర్స్ తలుపుతడుతున్నాయి. అభిజిత్ కి అవకాశాలు వచ్చాయన్నారు కానీ.. ఎక్కడా క్లారిటీ లేడు. ఇక అఖిల్ కి కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండబట్టి పెద్దగా అవకాశాల జోరు కనిపించడం లేదు.

అభిజిత్ కన్నా ఇప్పుడు సోహెల్ స్పీడు చూస్తే బిగ్ బాస్ తో సోహెల్ సెటిల్ అయినట్లే అంటున్నారు. విన్నర్, రన్నర్ కన్నా సోహెల్ స్పీడు కి అందరూ షాకవుతున్నారు. అభిజిత్ తో పాటుగా డబ్బులు పంచుకున్న సోహెల్.. ఇప్పుడు అవకాశాల విషయంలో బిగ్ బాస్ విన్నర్ కన్నా రన్నర్ కన్నా స్పీడుగా ఉన్నాడు. ఇప్పటికే చిరు, బ్రహ్మి లు ఎలాంటి పారితోషకాలు లేకుండా నీ సినిమాలో నటిస్తామంటే ఇప్పడు సోహైల్ హీరోగా సినిమా అనౌన్సమెంట్ వచ్చేసింది. ప్రెజర్ కుక్కర్ నిర్మాత.. శ్రీనివాస్ వింజనంపాటి డైరెక్షన్ లో సోహెల్ హీరోగా ఫిబ్రవరిలో సినిమా మొదలెట్టబోతున్నట్టుగా అనౌన్స్ చేసారు. మరి సోహెల్ నిర్మాతగా కాదు ముందు హీరోగానే ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. సోహెల్ కి స్టార్ మా కూడా బిగెస్ట్ ఆఫర్ ఇచ్చినట్టుగా సమాచారం. మరి సోహెల్ దూకుడు చూసిన వారు ఇప్పుడు కంగారు పడిపోతున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here