ఎపి ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు నెల్లూరును సందర్శించనున్నారు. అమ్మఒడి రెండో విడత కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం ఎటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయకూడదని నిబంధన విధించింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పర్యటన ఆసక్తిగా మారింది. జగన్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 11గంటలకు జగన్ నెల్లూరు చేరుకుని వేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. పాత పథకాలే కనుక నియమావళి వర్తించదని వైసీపీ నేతలు చెబుతున్నారు.