ఎపి ముఖ్యమంత్రి వైయస్ జగన్ దేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రులలో ఒకరిగా ఎదిగారు.
జాతీయ వార్తా ఛానల్ జరిపన సర్వేలో జగన్ మూడో స్థానంలో నిలిచారు. తొలి స్థానంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, రెండోస్థానంలో అరవింద్ కేజ్రీవాల్, మూడో స్థానంలో జగన్ నిలిచారు. జాతీయ వార్తా ఛానల్ ఏబీపీ న్యూస్ చేసిన దేశ్ కా మూడ్ సర్వేలో జగన్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రిగా జగన్ ఈ అరుదైన ఘనతను సాధించాు. దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాల పరిధిలో ఈ సర్వేను నిర్వహించారు.