ప‌వ‌ర్‌స్టార్ అంటే ఎంతిష్ట‌మో మంచు మ‌నోజ్‌కీ.. లుక్కేయండి మ‌రీ!

  80
  0
  bhimlanayak

  మంచు మ‌నోజ్‌కు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్ అంటే ఎంతో ఇష్టం.. ఆయ‌న‌ను అమితంగా అభిమానిస్తాడు మ‌నోజ్‌.. ఇటీవ‌లే జ‌రిగిన మా ఎన్నిక‌ల చివ‌రి ఘ‌ట్టంలో ఓటేయ‌డానికి వ‌చ్చిన ప‌వ‌న్‌ను స్వ‌యంగా క‌లిసి ఆయ‌న వెళ్లేంత‌వ‌ర‌కు ప‌వ‌న్‌తోనే ఉన్నాడు మ‌నోజ్‌.. ఇక తాజాగా మంచు మ‌నోజ్ హైద‌రాబాద్‌లోని భీమ్లానాయక్ సెట్స్‌లో ప‌వ‌న్‌క‌ళ్యాన్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. టాలీవుడ్‌లో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై దాదాపు గంట‌కు పైగా చ‌ర్చించుకున్నారు.

  ఇదిలా ఉంటే ఇటీవ‌లే జ‌రిగిన మా ఎన్నిక‌ల్లో మంచు విష్ణు మా అధ్య‌క్షుడిగా ఎన్నికైన విష‌యం తెలిసిందే. ప్ర‌చార స‌మ‌యంలో ప‌వ‌న్‌క‌ళ్యాన్ పై విష్ణు కాంట్ర‌వ‌ర్సీ కామెంట్స్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఇన్నాళ్లు మా ఎన్నిక‌ల హ‌డావుడితో వేడెక్కిన వాతావ‌ర‌ణం ఇప్పుడిప్పుడే చ‌ల్ల‌బ‌డుతుంది. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్‌ను మంచు మ‌నోజ్ క‌ల‌వ‌డంపై టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశ‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here