పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, భళ్లాలదేవ రానా కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం భీమ్లానాయక్. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ గ్లిమ్స్, టైటిల్ సాంగ్‌లతో పవర్‌స్టార్ పవన్‌కళ్యాన్ అభిమానులే కాకుండా .. సినీ ప్రేక్షకుల నుంచి ట్రెమండరెస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక పవన్‌కళ్యాన్ మరోసారి పోలీస్ పాత్రలో భీమ్లానాయక్‌గా నటిస్తుండగా.. మరో కీలకమైన పాత్రలో రానా డేనియల్ శేఖర్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి ఏ అప్డేట్ వచ్చిన ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో నుంచి రెండో పాటకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. అంతా ఇష్టమేందయ్యా నా మీనా అంటూ సాగే పాట ప్రోమోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. పూర్తి సాంగ్‌ను దసరా కానుకగా రేపు ఉదయం 10:19 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు ఆ ప్రోమోలో చూపించారు. మలయాళంలో భారీ హిట్ అందుకున్న అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రానికి రీమేక్‌గా భీమ్లానాయక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
మలయాళ ప్రముఖ నటుడు భీజుమీనన్ పాత్రలో పవన్‌కళ్యాణ్, మరో మలయాళ నటుడు పృథ్వీరాజ్ పాత్రలో రానా నటిస్తుండగా.. ఇక పవన్‌కు భార్యగా నిత్యామీనన్, రానాకు భార్యగా ఐశ్వర్య రాజేశ్ నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర డైరెక్షన్లో ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ మాటలు అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.