భీమ్లానాయ‌క్ నుంచి ప‌వ‌న్‌-నిత్యామీన్‌ల మెలోడీ సాంగ్ రిలీజ్‌..

  64
  0
  pavan nithaya

  ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్ న‌టిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్ తెలిసిన విష‌య‌మే.. ఈ చిత్రం అప్‌డేట్ కోసం ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్స్ ఎంతోగానో ఎదురుచూస్తుంటారు. ఇదివ‌ర‌కే రిలీజ్ అయిన‌ ఫ‌స్ట్‌ గ్లిమ్స్‌, టైటిల్ సాంగ్‌ల‌ను అభిమానుల‌తో పాటు సినీ ప్రేక్ష‌కుల్లో అద్భుత‌మైన రెస్పాన్స్ క్రియేట్ అయి ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ చిత్రానికి ఎస్‌. ఎస్‌. త‌మ‌న్ స్వరాలు అందిస్తుండ‌గా.. ప‌వ‌న్ అంటే త‌మ‌న్‌కీ ఎంతో ఇష్టం మ‌రీ ప‌వ‌న్ సినిమాకీ సాంగ్స్ ఏవిధంగా కంపోజ్ చేస్తాడో వ‌కీల్‌సాబ్, భీమ్లానాయ‌క్ సాంగ్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ నిరూపించిన విష‌యం తెలిసిందే.

  వీటితో ప‌వ‌న్ పై త‌న అభిమానాన్ని చాటుకున్నాడు త‌మ‌న్‌. ఇప్పుడు తాజాగా ద‌స‌రా ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని అంతా ఇష్ట‌మేంద‌య్యా అంటూ భీమ్లానాయ‌క్ నుంచి మెలోడి సాంగ్‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా చిత్ర‌బృందం షేర్ చేసింది.. ప్ర‌ముఖ గాయ‌ని చిత్ర ఈ సాంగ్‌ను ఆల‌పించ‌గా.. రామ‌జోగ‌య్య‌శాస్త్రి లిరిక్స్ అందించారు. ప‌వ‌న్‌- నిత్యామీన్‌ల మీద సాగిన ఈ గీతం అల‌రిస్తోంది.. ఇక ఈ చిత్రంలో ప‌వ‌ర్‌ఫుల్ పోలీసు ఆఫీస‌ర్‌గా ప‌వ‌న్ భీమ్లానాయ‌క్‌గా, మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో రానా ద‌గ్గుబాటి డేనియ‌ల్ శేఖ‌ర్‌గా న‌టిస్తున్నాడు.

  అలాగే ఈ సినిమాలో నిత్యామీన‌న్‌తో పాటు ఐశ్వ‌ర్యా రాజేశ్ ముఖ్య‌మైన పాత్ర‌ను పోషిస్తుండ‌గా.. సాగ‌ర్ కె చంద్ర డైరెక్ష‌న్‌లో పీడీవీ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ మూవీనీ నిర్మిస్తున్నారు. కాగా భీమ్లానాయ‌క్ చిత్రం మ‌ల‌యాళంలో భారీ హిట్ సొంతం చేసుకున్న అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కుతుండ‌గా.. ప‌వ‌ర్‌స్టార్ ఇమేజ్ త‌గ్గ‌ట్టుగా మార్పులు చేసి ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఈ చిత్రాన్ని రెడీ చేశాడు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ తుది ద‌శ‌లో ఉండ‌గా.. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here