సాయితేజ్ హ్యాపీ బ‌ర్త్‌డే అంటూ మెగాస్టార్ ట్వీట్‌!

  53
  0
  Saitej Discharge

  మెగా సుప్రీం హీరో సాయితేజ్ ఇటీవ‌లే బైక్ ఆక్సిడేంట్‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే. దీంతో మెగా అభిమానుల‌తో పాటు సినీ ప్ర‌ముఖుల‌కు షాక్‌కు గురిచేసింది.. కాగా బైక్ ప్ర‌మాదానికి గురైన సాయితేజ్ అప్ప‌టినుంచి అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు.. తాజాగా సాయితేజ్ పూర్తిగా కోలుకొని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయిన‌ట్లు ట్విట్ట‌ర్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి వెల్ల‌డించారు. శుక్ర‌వారం సాయితేజ్ బ‌ర్త్‌డేని పుర‌స్క‌రించుకుని బ‌ర్త్ డే విషేస్ తెలిపాడు చిరంజీవి.

  ఇది సాయితేజ్‌కు పున‌ర్జ‌న్మ‌లాంటిదని.. మా ఫ్యామిలీ మొత్తం ఎంతో ఆనందంగా ఉంది.. జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు సాయితేజ్‌ అని చిరంజీవి తెలిపారు.. ఇక ఈ వార్తాపై మెగా ఫ్యాన్స్ ద‌స‌రా సంద‌ర్భంగా అతి పెద్ద గుడ్ న్యూస్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ద‌స‌రా శుభాకాంక్ష‌లు చిరంజీవి తెలిపాడు. ఇదిలా ఉంటే సాయితేజ్ న‌టించిన తాజా చిత్రం రిప‌బ్లిక్ ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here