ఆర్‌జీవి ట్వీట్‌.. కౌంట‌ర్ ఇచ్చిన మంచు మ‌నోజ్!

  64
  0
  manchu manoj

  వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ.. ఇటీవ‌లే ఎన్నికైన మా అసోసియేష‌న్ నూత‌న అధ్యక్షుడిగా మంచు విష్ణుతో పాటు త‌న ప్యానెల్ స‌భ్యుల‌ను ఉద్దేశించి షాకింగ్ ట్వీట్ పెట్టిన విష‌యం తెలిసిందే. మా అసోసియేష‌న్ ఒక స‌ర్క‌స్ అని అందులో ఉండేవాళ్లు అంతా జోక‌ర్లు అంటూ కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన ట్విట్‌పై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ నేప‌థ్యంలో మంచు మ‌నోజ్ వ‌ర్మ ట్వీట్‌కు షాకింగ్ రిప్లై ఇచ్చారు.

  మా స‌ర్క‌స్ అయితే రామ్ గోపాల్ వ‌ర్మ రింగ్ మాస్ట‌ర్ అని మ‌నోజ్ త‌న పోస్ట్‌లో పేర్కొన్నాడు. కాగా మా ఎన్నిక‌లు జ‌రిగి వారం రోజులైనా ఈ ఎన్నిక‌ల వ‌ల్ల మా స‌భ్యుల మ‌ధ్య వివాదాలు పెరుగుతున్నాయి. ప్ర‌కాశ్‌రాజ్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత మంచు మోహ‌న్‌బాబు, విష్ణుల పై ఎన్నిక‌ల అధికారి కృష్ణ‌మోహ‌న్ గురించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. సినిమా వాళ్ల పరువును ఆర్‌జీవి తీస్తున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆర్‌జీవి అన‌వ‌స‌ర వివాదాల‌కు దూరంగా ఉంటే మంచిద‌ని అత‌ని అభిమానులు కీల‌క సూచ‌న‌లు చేస్తున్నారు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here