పెద‌నాన్న కృష్ణంరాజును ప్ర‌భాస్ ఏమ‌ని పిలుస్తాడంటే..

  73
  0
  prabhas

  యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. బాహుబ‌లి సినిమా త‌ర్వాత ఆయ‌న పాన్ ఇండియా స్థాయి హీరోగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆయ‌న సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే రిలీజ్ చేస్తున్నాడు. అయితే ప్ర‌భాస్ ఒక్కో సినిమా బ‌డ్జెట్ 300 కోట్ల రూపాయ‌ల కంటే ఎక్కువ మొత్తంగా ఉంది. దీంతో ప్ర‌భాస్ ఒక్కో సినిమాకు 100కోట్ల రూపాయ‌ల రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్న తొలి హీరోగా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్నాడు.

  ఇక ఇదిలా ఉంటే.. ఇటీవ‌లే జ‌రిగిన ఓ సినిమా వేడుక‌ల్లో ప్ర‌భాస్ పెద్ద‌మ్మ రెబెల్‌స్టార్ కృష్ణంరాజు స‌తీమ‌ణి శ్యామ‌ల‌దేవీగారు ప్ర‌భాస్‌కు సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు. ఇప్పుడు ప్ర‌భాస్ వ‌య‌స్సు 41. ప్ర‌భాస్ పెళ్లికి సంబంధించి సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్తాల‌ను తాము చాలా స‌ర‌దాగా తీసుకుంటామ‌ని.. ప్ర‌భాస్ పెళ్లి కోసం తమ ఫ్యామిలీ కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నామ‌ని శ్యామ‌లా దేవి గారు చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం సెట్స్‌పై ఉన్న సినిమాలు పూర్తైన వెంట‌నే పెళ్లి చేసుకుంటాన‌ని ప్ర‌భాస్ చెప్పాడ‌ని ఆమె అన్నారు.

  అలాగే ప్ర‌భాస్ త‌న‌ను ప్రేమ‌గా క‌న్న‌మ్మ అని పిలుస్తాడ‌ని.. పెద‌నాన్న కృష్ణంరాజును పెద్ద బాజీ అని పిలుస్తాడ‌ని త‌న ఫోన్‌లో కూడా ఆ పేర్ల‌తోనే సేవ్ చేసుకున్నాడ‌ని శ్యామ‌లాదేవిగారు చెప్పుకొచ్చారు. త‌మ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ.. అందుకే అంద‌రితో క‌లిసిపోయే అమ్మాయి కోసం వెతుకుతున్న‌మ‌ని అందువ‌ల్లే ప్ర‌భాస్ పెళ్లి ఆల‌స్య‌మ‌వుతుంద‌ని శ్యామ‌లాదేవిగారు తెలిపారు. ఇక ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌లార్‌, ఆదిపురుష్‌, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ చిత్రాల్లో న‌టిస్తుండ‌గా.. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా తాను న‌టించిన రాధేశ్యామ్ చిత్రం జ‌న‌వ‌రి14న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here