మ‌ర‌ణిస్తే బాధ ప‌డ‌తారు..కానీ శ‌వం ప‌క్క‌న హాట్‌గా ఫోటోల‌ను దిగేవాళ్ల‌ను చూశారా!

  97
  0
  modal

  ఎవ‌రైనా చ‌నిపోతే ఎమోష‌న‌ల్ అవుతారు.. కానీ ఓ మోడ‌ల్ త‌న తండ్రి చ‌నిపోతే.. ఆయ‌న శ‌వం ఉన్న ఫ్రీజ‌ర్ బాక్స్ ద‌గ్గ‌ర ఫోటోల‌కు ఫోజులిస్తుంది. యూఎస్‌లోని ఫ్లోరిడాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. ఇన్‌స్టాగ్రామ్ మోడ‌ల్ జైనె రివెరాకు సోష‌ల్ మీడియాలో కోట్ల‌లో ఫాలోవ‌ర్స్ ఉన్నారు. త‌ను ఏ విష‌యం అయినా స‌రే.. సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాలు కూడా సోష‌ల్ మీడియాలో పెట్టి కోట్ల మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. అయితే.. ప్ర‌స్తుతం త‌ను పెట్టిన కొన్ని ఫోటోల‌తో ఒక్క‌సారిగా నెటిజ‌న్ల ఆగ్ర‌హానికి గుర‌యింది.

  త‌న తండ్రి చ‌నిపోతే.. అత‌డి శ‌వం ప‌క్క‌న ఫోటోషూట్ చేసింది. అది కూడా న‌వ్వుతూ ఫోటోలు దిగి వాటిని త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. ఆ ఫోటోలు చూసిన నెటిజ‌న్లు త‌న‌పై విరుచుకుప‌డుతున్నారు. అస‌లు నువ్వు మ‌నిషివేనా.. నీకు బుద్ధి ఉందా? తండ్రి శ‌వాన్ని ప‌క్క‌న పెట్టుకొని ఈ ఫోటోషూట్‌లు ఏంది? ఆ న‌వ్వులు ఏంది? అంటూ త‌న‌పై తీవ్రస్థాయిలో విరుచుకుప‌డ‌టంతో వెంట‌నే ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది రివెరా.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here